ఆ తమిళ హీరోతో గొడవ పడబోతున్న బన్నీ  

Vijay Setupathi As A Villon In Allu Arjun Movie-south Cinema,tollywood,vijay Setupathi,villon In Allu Arjun Movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దూసుకుపోతుంది.

Vijay Setupathi As A Villon In Allu Arjun Movie-south Cinema,tollywood,vijay Setupathi,villon In Allu Arjun Movie Telugu Tollywood Movie Cinema Film Latest News-Vijay Setupathi As A Villon In Allu Arjun Movie-South Cinema Tollywood Vijay Movie

త్రివిక్రమ్ నుంచి చాలా రోజుల తర్వాత వచ్చిన మరో అద్బుత చిత్ర ఇదని చెప్పుకుంటున్నారు.బన్నీని జులాయిలో డబ్బంటే ఆశపడే కుర్రాడిగా చూపించి, సన్నాఫ్ సత్యమూర్తిలో తండ్రి బాద్యతలు మోసే కొడుకుగా ఆవిష్కరించారు.

ఈ రెండు సినిమాలు మంచి టాక్ తెచ్చుకున్న ఎవరేజ్ అనే అభిప్రాయం జనాలలో ఉంది.అయితే అల వైకుంఠపురంలో సినిమాకి మొదటి షో నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

ఇదిలా ఉంటే బన్నీ ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అది ఇప్పటికే ఓపెనింగ్ జరుపుకోవడం కూడా జరిగింది.ఇక ఫారెస్ట్ నేపధ్యంలో మక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుంది అనే టాక్ వినిపిస్తుంది.

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కె ఈ సినిమా కోసం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని విలన్ గా ఫైనల్ చేసినట్లు అధికారికంగా తెలుస్తుంది.ఇప్పటికే చిరంజీవి సైరాలో కీలక పాత్ర చేసిన సేతుపతి ప్రస్తుతం మరో మెగా హీరో వైష్ణవ తేజ్ ఎంట్రీ మూవీలో విలన్ గా నటిస్తున్నాడు.

ఈ సినిమా సుకుమార్ బ్యానర్ లోనే తెరకెక్కుతుంది.ఈ నేపధ్యంలో బన్నీ సినిమా కోసం సుకుమార్ విజయ్ సేతుపతి మీద ఆసక్తి చూపించి అతనిని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

మరి అడవిలో వీరిద్దరి గొడవ తెలుగు ప్రేక్షకులని ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు

Vijay Setupathi As A Villon In Allu Arjun Movie-south Cinema,tollywood,vijay Setupathi,villon In Allu Arjun Movie Related....