మూకీ సినిమాతో ప్రయోగం చేస్తున్న విజయ్ సేతుపతి

ఒక సినిమాలో అద్భుతమైన డైలాగులు అంత అద్భుతమైన పాటలు, మంచి కథనం, కథ ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది.అయితే పాటలు డైలాగ్స్ లేకుండా అసలు సంభాషణలు లేకుండా మూకీ సినిమాలతో హిట్ కొట్టడం అనేది చాలా అరుదైన విషయం.

 Vijay Sethupathi Work On Silence Movie, Tollywood, Kollywood, Kamal Hassan, Push-TeluguStop.com

హాలీవుడ్ లో ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి.ప్రయోగాత్మకంగా తెరకెక్కి హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి.

అయితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే అప్పుడెప్పుడో కమల్ హాసన్ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన పుష్పకవిమానం సినిమా మాత్రమే గుర్తుకొస్తుంది.సినిమాలో ఎలాంటి సంభాషణలు లేకుండా కేవలం డ్రామాతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

క్రైమ్ డ్రామాగా ఆ సినిమాని సింగీతం తెరపై ఆవిష్కరించారు.కమల్ హాసన్ అమల జంటగా నటించిన ఈ సినిమా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందని చెప్పాలి.

అలాంటి ప్రయోగాత్మక చిత్రాలు తర్వాత చాలామంది ప్రయత్నం చేసిన ఏవి కూడా అంతగా వర్కవుట్ కాలేదు.అయితే ఇప్పుడు కోలీవుడ్లో స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇలాంటి ప్రయోగాత్మక కథతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.పూర్తి మూకీ డ్రామాగా వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గాంధీ టాకీస్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది. కిషోర్ పాండురంగ డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు.

ఇక పోస్టర్లో మొత్తం కరెన్సీ నోట్లపై విజయ్ సేతుపతి పడుకున్నట్లు స్టిల్ వేశారు దీన్ని బట్టి ఇది కూడా క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతుందని తెలుస్తోంది.ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube