'ఆహా' వారు మళ్లీ ఓ మంచి డబ్బింగ్ సినిమా పట్టారు

తెలుగు సినిమాలను మాత్రమే అందిస్తాం అంటూ మొదలు అయిన ఓటీటీ ఆహా అన్నట్లుగానే తెలుగు సినిమాలను అందిస్తుంది.కాని అందులో ఎక్కువగా డబ్బింగ్ సినిమాలు ఉంటున్నాయి.

 Vijay Sethupathi Vikramarkudu Movie Streaming In Aha Ott, Aha Ott, Film News, Ne-TeluguStop.com

ఇప్పటి వరకు ఆహాలో వచ్చి సక్సెస్ అయిన సినిమాల్లో ఎక్కువ శాతం డబ్బింగ్ సినిమాలే అవ్వడం గమనార్హం.మలయాళం మరియు తమిళ ఇండస్ట్రీకి చెందిన పాత కొత్త సినిమాలను చిన్న చిన్న మొత్తాలకు కొనుగోలు చేయడం వాటిని డబ్బింగ్‌ చేసి తెలుగులో ఆహా లో విడుదల చేయడం చేస్తున్నారు.

ఇటీవల వచ్చిన జీవీ సినిమా కూడా తమిళం నుండే వచ్చింది.ఆ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టకుండా రెగ్యులర్ గా వారం వారం ఆహా ప్రేక్షకులకు ఎంటర్‌ టైన్‌ మెంట్ ను అందిస్తున్నారు.ఆహాలో ప్రతి వారం కొత్త సినిమాలు వస్తున్నాయి కాని వాటిలో ఎక్కువ శాతం డబ్బింగ్‌ అవ్వడం వల్ల ప్రేక్షకులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

అయితే అవి మంచి సినిమాలు కంటెంట్‌ బాగున్న సినిమలు అవ్వడం వల్ల జనాలు నెగటివ్ గా స్పందించడం లేదు.

ఇక ఆహా లో ఈ వారంలో విక్రమార్కుడు స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది.

తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విజయ్‌ సేతుపతి సినిమాను విక్రమార్కుడుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Telugu Aha Ott, Kollywood, Telugu, Tamil, Telugu Ott, Tollywood-Movie

దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్‌ ను విడుదల చేసిన ఆహా వారు సినిమా పై అంచనాలు అమాంతం పెంచేశారు.ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేసే విధంగా ఉంటుందని.విజయ్‌ సేతుపతి అభిమానులకు పండుగలా ఉంటుందని అంటున్నారు.

మరి ఈసినిమా ఎలా ఉంటుంది.ఆహాకు మరో విజయాన్ని ఈ సినిమా అందిస్తుందా చూడాలి అంటే మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube