విజయ్ సేతుపతి నటుడు కాకముందు అనుభవించిన దుస్థితి తెలిస్తే కన్నీళ్లాగవు?

తమిళ స్టార్ హీరో, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.పేరుకి తమిళ హీరోనే అయినా తెలుగు లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న హీరోల్లో విజయ్ సేతుపతి కూడా ఒకరు.

 Vijay Sethupathi Unknown Struggles Become An Actor, Director Karthik Subbaraju,-TeluguStop.com

తమిళంలో ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన పిజ్జా చిత్రంలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ హీరో.

అయితే కేవలం హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు పలువురి స్టార్ హీరోల చిత్రాల్లో గెస్ట్ అప్పియరెన్స్ మరియు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూ విలక్షణ నటుడిగా గొప్ప కీర్తిని పొందారు.

ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్ కి తమిళం, తెలుగు భాషల్లో మంచి క్రేజ్ ఉంది.అంతేకాదు తక్కువ నిడివి ఉన్న పాత్ర అయినా తన క్రేజ్ కారణంగా కోట్లల్లో పారితోషికం తీసుకుంటున్నారు అని సమాచారం.

అయితే ఇపుడు కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న ఈ నటుడు ఒకప్పుడు కనీసం ఒక పూట భోజనానికి….కనీసం ఒక చిన్న బన్ను ముక్కకు కూడా డబ్బులు లేకుండా కష్టాలు పడ్డాడు అంటే నమ్మగలరా, కానీ ఇదే వాస్తవం.విజయ్ సేతుపతి తింటున్న బర్గర్ ముక్కను చూసి ఒక దర్శకుడు కన్నీళ్లు పెట్టుకుని అతనికి రూ.100 ఇచ్చి వెళ్ళారు అంటే అప్పట్లో విజయ్ సేతుపతి అనుభవించిన దుస్థితి మీకు అర్థమవుతుంది.అలాంటి ఒక వ్యక్తి తన పట్టుదలతో, కృషితో, ప్రతిభ తో నేడు ఈ స్థాయిలో ఉన్నారు అంటే అతడి సంకల్ప బలం నిజంగా మెచ్చుకుని తీరాలి.ఇంతకీ ఆ దర్శకుడు ఎందుకు విజయ్ ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు అంటే….

అప్పట్లో అవకాశం కోసం కాళ్ళు అరిగేలా తిరుగుతున్న విజయ్ సేతుపతి హీరో పాత్ర కోసం ఒక ఆడిషన్ కి వెళ్ళాడు.ఆ సమయంలో ఆడిషన్స్ లో డైరెక్టర్ చెప్పిన దానికన్నా పదిరెట్లు ఎక్కువగానే పర్ఫార్మెన్స్ ఇచ్చి మెప్పించాడు.

కానీ ఛాన్స్ అయితే దక్కలేదు.

Telugu Kollywood, Tamil, Vijaysethupathi-Telugu Stop Exclusive Top Stories

బయటకు వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ సేతుపతి దగ్గరకు వచ్చి… బాబు నువ్వు ఎక్సలెంట్ గా నటించావు నీలో చాలా టాలెంటు ఉంది.నువ్వు తప్ప మరెవరూ అక్కడ పర్ఫామెన్స్ ఇవ్వలేదు, అయితే ఒక వ్యక్తి నిర్మాత రికమండేషన్ తో వచ్చాడు కాబట్టి అతన్ని ఫైనల్ చేశారు.దాంతో నీకు ఛాన్స్ మిస్స్ అయ్యింది.

కానీ బాధపడకు నీ టాలెంట్ కి తప్పక అవకాశం లభిస్తుంది అంటూ మాట్లాడుతుండగా, విజయ్ సేతుపతి ఏదో తింటూ దాచుకోవడం చూశారు అసిస్టెంట్ డైరెక్టర్.బాగా చూస్తే ఆ సమయంలో ఉన్న తేజస్సు అప్పుడు విజయ్ సేతుపతి ముఖంలో లేదు.

చేతిలో ఉన్న కర్చీఫ్ లో బర్గర్ తింటూ కనిపించాడు.గమనిస్తే అది ఆ అసిస్టెంట్ డైరెక్టర్ రెండు రోజుల క్రితం తిని మిగిల్చి పడేసిన బర్గర్ అని తెలిసింది.

అది గుర్తించి విజయ్ ని అడుగగా ఆకలికి అవన్నీ తెలియవు, నా పరిస్థితి ఇది అంటూ చెప్పడంతో ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కి కన్నీళ్లు ఆగలేదు.నువ్వు తప్పక సక్సెస్ అవుతావు అంటూ చేతిలో వంద రూపాయలు పెట్టి వెళ్లారట.

అలా అప్పట్లో విజయ్ సేతుపతి అనుభవించిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు.అలాంటి ధైర్య పరిస్థితి నుండి నేడు సూపర్ స్టార్ హోదాకు చేరుకున్నాడు విజయ్ సేతుపతి.

టాలెంట్ , కష్టాన్ని నమ్ముకున్న వాడు ఎప్పుడూ ఓడిపోడు అన్నదానికి ఇది ఒక చక్కని నిదర్శనం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube