టీవీ హోస్ట్ గా మారబోతున్న కోలీవుడ్ స్టార్ హీరో

స్టార్ హీరోలుగా ఉన్నవారి క్రేజ్ ని ఉపయోగించుకొని అప్పుడప్పుడు టెలివిజన్ పై రియాలిటీషోలని ప్రొడక్షన్ హౌస్ లు ప్లాన్ చేస్తూ ఉంటాయి.వారిని హోస్ట్ గా పెట్టుకొని షోకి క్రేజ్ తీసుకురావడంతో పాటు టీఆర్పీ రేటింగ్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తాయి.

 Vijay Sethupathi Turned As A Tv Host, Tollywood, Kollywood, South Heroes, Jr Ntr-TeluguStop.com

ఒక్కోసారి ఈ ప్రయత్నం భాగా వర్క్ అవుట్ అవుతుంది.ఒక్కోసారి స్టార్స్ హోస్ట్ చేసిన షోలు ఫెయిల్ అవుతూ ఉంటాయి.

అయితే అలా ఫెయిల్ అవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.బాలీవుడ్ లో ఇప్పటికే సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబచ్చన్ లాంటి స్టార్స్ టీవీలో హోస్ట్ లుగా మారిపోయారు.

అలాగే టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జున, నాని, ఎన్టీఆర్, రానా లాంటి స్టార్స్ అందరూ హోస్ట్ గా తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు షోకి హోస్ట్ గా చేయబోతున్నాడు.

త్వరలో ఈ షో ప్రారంభం అవుతుంది.ఇదిలా ఉంటే కోలీవుడ్ లో కమల్ హసన్ బిగ్ బాస్ రియాలిటీషోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

మిగిలిన హీరోలు బుల్లితెరపై చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.

అయితే ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా హోస్ట్ గా చేయడానికి నేను రెడీ అంటూ ముందుకొచ్చాడు.

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్ సన్ నెట్ వర్క్ లో విజయ్ సేతుపతి హోస్ట్ గా ఓ రియాలిటీషో రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.త్వరలో ఈ షోకి సంబందించి అధికారిక ప్రకటన రానుంది.

ఇదిలా ఉంటే ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో విలన్ గా గ్రాండ్ సక్సెస్ కొట్టిన విజయ్ సేతుపతి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కత్రినా కైఫ్ తో రొమాన్స్ చేయబోతున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube