శ్రీలంక బౌలర్ మురళీధరన్ పాత్రలోకి విజయ్ సేతుపతి

ఎంతో మంది క్రికెటర్లు జీవితాలని సిల్వర్ స్క్రీన్ పై బయోపిక్ సినిమాలుగా మలిచే ప్రయత్నం ఈ మధ్య కాలంలో జరుగుతుంది.అలా వచ్చిన సినిమాలు సూపర్ హిట్ టాక్ కూడా సొంతం చేసుకున్నాయి.

 Vijay Sethupathi To Play Muttiah Muralitharan In His Biopic, Indian Cinema, Sril-TeluguStop.com

ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ నేపధ్యంలో వారి జీవితంలోని విశేషాలు, అనుభవాలు తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజలకి ఉంటుంది.దీనినే నిర్మాతలు క్యాష్ చేసుకోవడానికి బయోపిక్ లు తెరపై ఆవిష్కరిస్తున్నారు.

ఇప్పటి వరకు ఇండియన్ క్రికెట్ సెలబ్రెటీల కథలు మాత్రమే తెరపైకి వచ్చాయి.ఇప్పుడు శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథని కూడా తెరపై ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు.

ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీగా ఈ సినిమాని ఆవిష్కరించబోతున్నారు.శ్రీపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది.

ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ హౌస్ లు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నాయి.

శ్రీలంక క్రికెటర్ అయినా మురళీధరన్ కి ఇండియాలో మంచి గుర్తింపు ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.ఇందుకోసం ఆయన క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు.అందులో భాగంగా మురళీధరన్ వద్ద స్పిన్ మెళకువలను కూడా తెలుసుకున్నాడు.ఈ చిత్రానికి 800 అనే టైటిల్ని కన్ఫర్మ్ చేశారు.

మురళీధరన్ టెస్టు క్రికెట్లో 800 వికెట్లు తీసి అరుదైన రికార్డు సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే.ఈ నేపధ్యంలో సినిమాకి అదే టైటిల్ కన్ఫర్మ్ చేశారు.

లాక్ డౌన్ వల్ల వాయిదా పడిన ఈ చిత్రం షూటింగును త్వరలో మొదలుపెడుతున్నారు.ఈ లోగా ఈ నెల 13న ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

రజిశ విజయన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube