బుల్లితెరపై విజయ్ సేతుపతి ఎంట్రీ ఇచ్చేది ఎప్పటినుంచంటే?

తమిళ స్టార్ హీరో గా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ పొందిన నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాలలో విలన్ పాత్రలు పోషిస్తూ అద్భుతమైన తెలుగు అభిమానులను సంపాదించుకున్నారు.

 Vijay Sethupathi To Host Masterchef Tamil On Sun Tv-TeluguStop.com

ప్రస్తుతం వెండితెరపై ఎంతో బిజీగా గడుపుతున్న విజయ్ సేతుపతి ఇకపై బుల్లితెరపై కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే బుల్లితెరపై ప్రసారమవుతున్న “మాస్టర్ చెఫ్” తమిళ కార్యక్రమానికి విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

 Vijay Sethupathi To Host Masterchef Tamil On Sun Tv-బుల్లితెరపై విజయ్ సేతుపతి ఎంట్రీ ఇచ్చేది ఎప్పటినుంచంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇకపోతే ఈ కార్యక్రమం బుల్లితెరపై ఆగస్టు 7వ తేదీ నుంచి సన్‌టీవీలో శని, ఆదివారాలలో ప్రసారం కానుంది.

Telugu August 7, Innovative Film Academy, Kollywood, Latest News In Telugu, Sharavana Prasad, Tamanna Host, Tamil Actor, Tamil Masterchef Series, Telugu Version, Vijay Sethupathi-Movie

ఈ సందర్భంగా ఇన్నోవేటివ్‌ ఫిల్మ్‌ అకాడమీ వ్యవస్థాపకుడు శరవణప్రసాద్‌ మంగళవారం రాత్రి విలేకరుల ఈ సమావేశంలో మాట్లాడుతూ… మాస్టర్ చెఫ్ కార్యక్రమాన్ని తమిళంలో ప్రారంభించడం,ఈ కార్యక్రమానికి తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరించడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా శరవణప్రసాద్ తెలియజేశారు.

Telugu August 7, Innovative Film Academy, Kollywood, Latest News In Telugu, Sharavana Prasad, Tamanna Host, Tamil Actor, Tamil Masterchef Series, Telugu Version, Vijay Sethupathi-Movie

అయితే ఈ కార్యక్రమం పలు భాషలలో ప్రసారంకానున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే తెలుగులో ఈ కార్యక్రమానికి మిల్క్ బ్యూటీ తమన్నా హోస్ట్ గా వ్యవహరించనున్నారు.మరి తెలుగులో ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రసారం అవుతుందనే విషయం నిర్వాహకులు వెల్లడించాల్సి ఉంది.

#Tamanna Host #Tamil #Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు