విజయ్‌ సేతుపతి' రివ్యూ

తమిళంలో స్టార్‌ హీరోగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా విలన్‌గా దూసుకు పోతున్న విజయ్‌ సేతుపతి నటించిన ఈ చిత్రంను కాస్త ఆలస్యంగా తెలుగులో విడుదల చేస్తున్నారు.96 చిత్రం తర్వాత విజయ్‌ సేతుపతికి తెలుగులో మంచి క్రేజ్‌ దక్కింది.ఈయన సైరా నరసింహారెడ్డిలో కూడా ఛాన్స్‌ దక్కింది.మరో రెండు మూడు తెలుగు సినిమాల్లో కూడా ఈయన నటిస్తున్నాడు.ఈ నేపథ్యంలోనే తెలుగు ఈయన డబ్బింగ్‌ సినిమా విడుదల అనడంతో అందరిలో ఆసక్తి రేకెత్తింది.మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

 Vijay Sethupathi Story Review Rating-TeluguStop.com

కథ :


Telugu Vijaysethupathi-

పల్లెటూరుకు చెందిన వ్యక్తి సేతుపతి(విజయ్‌ సేతుపతి).ఆ పల్లెటూరులో అంతా ఆనందంగా.సంతోషంగా గడుపుతున్న సమయంలో ఆ ఊరిలో ఒక భారీ ఇండస్ట్రీని ఏర్పాటు చేసి ఊరును నాశనం చేసేందుకు మంత్రి చంటబ్బాయి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.ఇండస్ట్రీకి సేతుపతి అడ్డు పడుతుండటంతో అతడి కుటుంబ సభ్యులందరిని కూడా చంటబ్బాయి చంపిస్తాడు.

ఆ తర్వాత చరణ్‌(విజయ్‌ సేతుపతి డబుల్‌ రోల్‌) ఎంట్రీ ఇస్తాడు.సేతుపతిలాగే ఉండే చరణ్‌ ఆ గ్రామాన్ని ఆదుకుంటాడు.ఇంతకు సేతుపతికి చరణ్‌కు సంబంధం ఏంటీ? ఇద్దరు ఒకేలా ఎందుకు ఉన్నారు? అనే విషయాలను సినిమా చూసి తెలుసుకోండి.

నటీనటుల నటన :


రెండు విభిన్నమైన పాత్రల్లో విజయ్‌ సేతుపతి ఆకట్టుకున్నాడు.తాను పోషించిన రెండు పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ముఖ్యంగా యాక్షన్‌ సీన్స్‌లో మనోడి సత్తా మామూలుగా లేదు.ఇక హీరోయిన్స్‌తో రొమాంటిక్‌ సీన్స్‌ విషయంలో కూడా అలరించాడు.ఇక హీరోయిన్స్‌గా నటించిన రాశి ఖన్నా మరియు నివేదా చూడ్డానికి అందంగా ఉన్నారు.

కాని వీరికి నటించేందుకు పెద్దగా స్కోప్‌ దక్కలేదు.ఉన్నంతలో పర్వాలేదు అనిపించారు.ఇక మిగిలిన వారు కూడా వారి పాత్రల పరిధిలో నటించి పర్వాలేదు అనిపించారు.

టెక్నికల్‌ :


పాటల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.ఎందుకంటే సినిమా పాటలు మొత్తం కూడా తమిళ ఫ్లేవర్‌తో ఉన్నాయి.తెలుగు వారికి ఎక్కేలా లేవు.ఇక బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఒక మోస్తరుగా ఉంది.సినిమాటోగ్రపీ విషయంలో మెచ్చుకోవాల్సిందే.

పల్లె అందాలను చక్కగా చూపించడంలో సినిమాటోగ్రాఫర్‌ సక్సెస్‌ అయ్యాడు.దర్శకుడు కథను ఇంకాస్త ఆసక్తికరంగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో నడిపించి ఉంటే సినిమా మరో లెవల్‌లో ఉండేది.

నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.ఎడిటింగ్‌లో అక్కడక్కడ కొన్ని జర్క్‌లు ఉన్నాయి.

విశ్లేషణ :


విజయ్‌ సేతుపతికి నటుడిగా మంచి పేరుంది.అంతడు చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద విజయాలను దక్కించుకుంటున్నాయి.

తమిళంలో ప్రస్తుతం ఈయన మోస్ట్‌ క్రేజీ హీరో.తెలుగులో కూడా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా బిజీగా ఉన్నాడు.

ఇలాంటి ఈయన సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం లేరు.ఈ సినిమా కథ ఎక్కువగా చిరు 150వ సినిమా ఖైదీ నెం.150 కథను పోలి ఉంది.అందువల్ల కూడా ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వలేక పోతున్నారు.తమిళ ఫ్లేవర్‌ ఎక్కువగా ఉండటం వల్ల ఈ చిత్రంను తెలుగు ఆడియన్స్‌ ఆధరించడం కష్టమే అనిపిస్తుంది.

ప్లస్‌ పాయింట్స్‌ :


విజయ్‌ సేతుపతి, రాశిఖన్నా

మైనస్‌ పాయింట్స్‌ :



తమిళ ఫ్లేవర్‌ ఎక్కువ అయ్యింది,
కథ, కథనం,
ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గడం

బోటమ్‌ లైన్‌ :


విజయ్‌ సేతుపతి రేంజ్‌ స్థాయిలో లేదని చెప్పక తప్పడం లేదు.

రేటింగ్ : 2.0/5.0


.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube