సెట్ లో పిల్లాడిని భయపెట్టి ఏడిపించేసిన విజయ్ సేతుపతి.. వైరల్ వీడియో!

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి గురించి అందరికీ తెలిసిందే.నట జీవితంలో ఆయనకున్న అభిమానం అంతా ఇంతా కాదు.

 Vijay Sethupathi Scares A Child In Kaathu Vaakula Rendu Kaada Movie Shooting Det-TeluguStop.com

తమిళం, తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లో చేసిన ఆయన తెలుగు రాష్ట్రాల్లో కూడా అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.ఆయన ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.

సినీనటుడు గానే కాకుండా నిర్మాత, స్క్రీన్ రైటర్, ప్లే బ్యాక్ సింగర్ గా పేరును సంపాదించుకున్నాడు.

ఒక చిన్న సినిమాతో చిన్న పాత్రలో వెండితెరకు పరిచయం అయిన విజయ్ సేతుపతి ఆ సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.

ఇక అవన్నీ తనలోని మరింత కసిని పెంచి ఇప్పుడు స్టార్ హీరో వరకి ఎదిగి ఓ రేంజ్ లో పేరును సంపాదించుకున్నాడు.మొదటిసారి పిజ్జా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి పలు భాషల్లో కూడా అందరిని ఆకట్టుకున్నాడు.

అంతేకాకుండా డబ్బింగ్ సినిమాలను కూడా చేశాడు.ఆయన తమిళంలో నటించిన సినిమా ఓటీటీ లో విడుదల కాగా మంచి విజయాన్ని అందుకుంది.

ఇదిలా ఉంటే తెలుగు సినీ పరిశ్రమలో కూడా నటించగా.చిరంజీవి నటించిన సైరా సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు.అంతేకాకుండా ఓ రేంజ్ లో సూపర్ హిట్ సక్సెస్ సొంతం చేసుకున్న ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర మొత్తం బాగా ఆకట్టుకుంది.ఆ సినిమాల్లో ఆయన నెగెటివ్ రోల్ లో నటించగా ఆయన విశ్వరూపం మాత్రం ఆ సినిమాకు మంచి విజయాన్ని అందించిందని అర్థమవుతుంది.

ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర శేషారాయణం.ఈ పాత్రలో ఆయన హీరోయిన్ కృతి శెట్టి తండ్రిగా మెప్పించాడు.ఈ సినిమాలో ప్రతి ఒక్క సీన్ లో విజయ్ సేతుపతి పాత్ర సినిమానే డామినేట్ చేసేలా ఉంది.ఈయన ప్రస్తుతం కొలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.

ఇటీవలే ఈయన పలు భాషల్లో విడుదలైన కాతు వాకుల రెండు కాదల్ సినిమాల్లో నటించి మరో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు.అంత స్టార్ హోదాలో ఉన్న కూడా విజయ్ సేతుపతి ఒక మామూలు వ్యక్తిలా కనిపిస్తాడు.

ఆ వ్యక్తిత్వంతోనే ఎంతోమందిని అభిమానులుగా మార్చుకున్నాడు.ప్రతి ఒక్కరికి విజయ్ సేతుపతి ఇచ్చే మర్యాద అంతా ఇంతా కాదు.

అందరిని తన వాళ్ళ లాగ అనుకొని దగ్గరకు తీసుకుంటాడు.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా విజయ్ సేతుపతి ఒక అబ్బాయిని భయపెట్టి ఏడిపించేసాడు.ఇంతకీ అసలు విషయం ఏంటంటే కాతు వాకుల రెండు కాదల్ సినిమా షూటింగ్ సమయంలో సెట్ లో విజయ్ సేతుపతి ఒక పిల్లవాడిని భయపెట్టిస్తూ ఆట పట్టించాడు.దీంతో ఆ పిల్లోడు ఒకేసారి ఉలిక్కిపడగా విజయ్ సేతుపతి తెగ నవ్వుకున్నాడు.

ఇక ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube