వామ్మో.. విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ అన్ని కోట్లా..?  

wow...vijay sethupathi remuneration is in this much of crores, vijay sethupathi remuneration 13 crores for one movie, master movie, vilan role - Telugu 13 Crore Rupees, Master Movie, Remuneration, Vijay Sethupathi, Vilan Role

తెలుగు, తమిళ భాషల్లో వేర్వేరు పాత్రల్లో నటిస్తూ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు విజయ్ సేతుపతి.96 సినిమా ద్వారా సౌత్ ఇండియా అంతటా గుర్తింపును సంపాదించుకున్న విజయ్ సేతుపతి సంక్రాంతి పండుగకు విడుదలైన మాస్టర్ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించారు.విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించిన ఉప్పెన సినిమా కూడా త్వరలో విడుదల కానుంది.

TeluguStop.com - Vijay Sethupathi Remuneration 13 Crores For One Movie

మరి కొందరు స్టార్ హీరోల సినిమాల్లో కూడా విజయ్ సేతుపతి విలన్ పాత్రల్లో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నా అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది.

మాస్టర్ సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోయినా కలెక్షన్ల పరంగా మాత్రం మాస్టర్ సినిమా హిట్ అనిపించుకుంది.సాధారణంగా సినిమా బడ్జెట్ పాత్రను బట్టి విజయ్ సేతుపతి 9 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకునే వారని.

TeluguStop.com - వామ్మో.. విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ అన్ని కోట్లా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే మాస్టర్ సినిమా హిట్ అయిన తరువాత రేటును భారీగా పెంచేశారని సమాచారం.

కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ ను 12 కోట్ల రూపాయల నుంచి 13 కోట్ల రూపాయల వరకు పెంచేసినట్లు గాసిప్స్ గుప్పుమన్నాయి.తెలుగులో విడుదల కాబోతున్న ఉప్పెన సినిమా కూడా సక్సెస్ అయితే విలన్ పాత్రలతో విజయ్ సేతుపతి మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.విజయ్ సేతుపతికి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నా వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని తెలుస్తోంది.

విజయ్ సేతుపతి తనకు నప్పే పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ కెరీర్ విషయంలో ముందడుగులు వేస్తున్నారు.

ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రలతోనూ మెప్పిస్తూ విజయ్ సేతుపతి కెరీర్ విషయంలో ముందడుగులు వేస్తుండటం గమనార్హం.ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుండగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

#13 Crore Rupees #Remuneration #Vilan Role

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు