శ్రీలంకను నమ్ముకున్న తమిళ హీరో.. విషయమేమిటంటే?  

Vijay Sethupathi Pushpa Ntr30 - Telugu Ntr30, Pushpa, Srilanka, Vijay Sethupathi

తమిళంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న స్టార్ నటుడు విజయ్ సేతుపతి, ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు.విజయ్ సేతుపతి ఓ చిత్రంలో నటిస్తున్నాడంటే అందులో ఖచ్చితంగా దమ్ముంటుందని తమిళ ప్రేక్షకులు నమ్ముతుంటారు.

 Vijay Sethupathi Pushpa Ntr30

ఇలాంటి విజయ్ సేతుపతి ప్రస్తుతం ఇతర భాషల్లోనూ తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే తెలుగులో సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించి మెప్పించిన ఈ తమిళ స్టార్, ఇప్పుడు ఉప్పెన సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్పలో కూడా విలన్ పాత్రలో తొలుత విజయ్ సేతుపతినే అనుకున్నారు.కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి విజయ్ తపుకున్నాడు.

శ్రీలంకను నమ్ముకున్న తమిళ హీరో.. విషయమేమిటంటే-Gossips-Telugu Tollywood Photo Image

కాగా ప్రస్తుతం ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబో రాబోయే సినిమాలో నటించేందుకు విజయ్ సేతుపతి రెడీ అవుతున్నాడు.అటు తమిళంలో విజయ్ సేతుపతి ఓ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

శ్రీలంక దేశ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న ఓ సినిమాలో విజయ్ సేతుపతి నటించేందుకు రెడీ అవుతున్నాడు.

వెంకట కృష్ణ రొఘంత్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి చాలా వైవిధ్యమైన పాత్రలో నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

అయితే భారత్‌లోనే అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో, ఇలా శ్రీలంక నేపథ్యంలో సినిమా తీయడం ఏమిటని పలువురు తమిళ తంబీలు విజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

మరి రిలీజ్ తరువాత ఈ సినిమా ఎలాంటి వివాదాలకు తెర తీస్తుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vijay Sethupathi Pushpa Ntr30 Related Telugu News,Photos/Pics,Images..

footer-test