మెగా హీరోకి మామగా మారబోతున్న విజయ్ సేతుపతి  

వైష్ణవ్ తేజ్ కి మామగా కనిపించబోతున్న విజయ్ సేతుపతి. .

Vijay Sethupathi Play Heroine Father Role In Vaishnav Tej Movie-telugu Cinema,tollywood,vaishnav Tej Movie,vijay Sethupathi Play Heroine Father Role

తమిళ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ టైమ్ లోనే హీరోగా టర్న్ తీసుకొని వరుస విజయాలతో స్టార్ డమ్ సొంతం చేసుకున్న నటుడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం తమిళనాడులో తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని స్టార్ హీరోల కేటగిరిలో కొనసాగుతున్న టాలెంటెడ్ హీరో ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి ఒకటి కాగా, మరో సినిమా కూడా మెగా కాంపౌండ్ లోనే సాయి ధరంతేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ ఒకటి..

మెగా హీరోకి మామగా మారబోతున్న విజయ్ సేతుపతి-Vijay Sethupathi Play Heroine Father Role In Vaishnav Tej Movie

ఇదిలా ఉంటే ఈ సినిమాలో వైష్ణవ తేజ్ కి విలన్ గా విజయ్ సేతుపతి కనిపించబోతున్నాడు. అది కూడా హీరోయిన్ తండ్రి పాత్రలో అని తెలుస్తుంది.

ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్ర అయినా కూడా హీరోతో సమానమైన ఎలివేషన్ ఉండడంతో విజయ్ సేతుపతి ఈ పాత్రను చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తుంది.

తమిళంలో కూడా విజయ్ సేతుపతి రెగ్యులర్ హీరోల తరహాలో కాకుండా డిఫరెంట్ జోనర్ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు టాలీవుడ్లో కూడా మెగా కాంపౌండ్ లో 2 క్రేజీ సినిమాలలో విజయ్ సేతుపతి కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే తన సినిమాలతో టాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఈ రెండు సినిమాల్లో ఏ మాత్రం తన సత్తా చూపిస్తాడు అనేది వేచి చూడాల్సిందే.