మాస్టర్ మూవీలో గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్న విజయ్ సేతుపతి

ఇండియన్ సినిమాలో విలక్షణ నటులు అంటే ముందుగా తమిళ చిత్ర పరిశ్రమ గురించి చెప్పుకోవాలి.అక్కడి హీరోలు చాలా మంది ఏదో హీరోయిజం కంటే ఎక్కువగా తమలోని నటుడిని పరిచయం చేయడానికి ఇష్టపడతారు.

 Vijay Sethupathi Open Up On Master Movie Role, Tollywood, Kollywood, South Cinem-TeluguStop.com

ఇలా కమల్ హాసన్, విక్రమ్ పేర్లు తమిళనాట ఎక్కువగా విలక్షణ నటనకి కేరాఫ్ అడ్రెస్స్ గా ఇప్పుడు ఇదే లిస్టులోకి విజయ్ సేతుపతి కూడా వచ్చి చేరాడు.అతి తక్కువ కాలంలోనే కోలీవుడ్ లో విలక్షణ నటుడుగా విజయ్ గుర్తింపు పొందాడు.

కేవలం హీరో పాత్రలే చేస్తానంటూ గిరిగీసుకొని కూర్చోకుండా కొత్తదనం కోసం ఎప్పటికప్పుడు తనని తాను మార్చేసుకుంటూ వస్తున్నాడు.నెగిటివ్ రోల్స్ లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

ఇప్పటికే రజినీకాంత్ సినిమాలో విలన్ గా కనిపించిన విజయ్ సేతుపతి తెలుగులో ఉప్పెన సినిమాలో కూడా పవర్ ఫుల్ విలనిజం చూపిస్తున్నాడు.తమిళ్ స్టార్ హీరో విజయ్ మాస్టర్ సినిమాలో కూడా విజయ్ సేతుపతి విలనిజం చూపించబోతున్నాడు.

మాస్టర్ చిత్రం కూడా విడుదలకి రెడీ అవుతుంది.ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాస్టర్‌లో తాను నటించిన విలన్ రోల్ గురించి మాట్లాడుతూ హీరో విజయ్‌కి విలన్‌గా నటిస్తూ బాగా ఎంజాయ్ చేశానంటున్నాడు.

లోకేష్ కనకరాజ్ నా కేరెక్టర్‌ని చాలా భయంకరంగా రాసుకున్నాడని, మాస్టర్ సినిమాలో తానొక భయానకమైన గ్యాంగ్ స్టార్‌గా నటించానని చెప్పాడు.ప్రతి వ్యక్తిలోనూ చెడు ఉంటుంది.ఆ చెడుని వదిలించుకోవడానికి మార్గం ఉంటుందా, లేదా అనే విషయంపై నాకు క్లారిటీ లేదు.ఓ నటుడు నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ చేస్తున్నప్పుడు మాత్రం అతనిలోని చెడ్డ వ్యక్తి బయటికి వస్తాడు.

మాస్టర్‌లో నేనొక భయంకరమైన గ్యాంగ్ స్టార్‌గా నటించాను అని పేర్కొన్నాడు.మాస్టర్ సినిమా కరోనా రాకపోతే మార్చిలోనే విడుదలకావాల్సింది.

కానీ థియేటర్స్ బంద్ వలన మాస్టర్ వాయిదా పడింది.ఇక థియేటర్స్ తెరుచుకున్నాయి కాబట్టి త్వరలో మాస్టర్ రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube