తూచ్.. బన్నీ సినిమాలో అ వార్త నిజం కాదట!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నాడు.ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.

 Vijay Sethupathi Not Police Officer In Allu Arjun Sukumar Movie-TeluguStop.com

అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లను తాత్కాలికంగా నిలిపేవేసిన సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమాలో బన్నీ ఓ లారీ డ్రైవర్ పాత్రలో రఫ్ లుక్‌లో కనిపిస్తాడని, అతడి లుక్ ఈ సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తోంది.కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా విజయ్ సేతుపతి నటించబోయే పాత్ర పోలీస్ ఆఫీసర్ అని, అతడు హీరోను పట్టుకునే పనిలో ఉంటాడని చిత్ర వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.కానీ అవన్నీ గాలివార్తలే అంటోంది చిత్ర యూనిట్.

విజయ్ సేతుపతి నటించేది పోలీస్ పాత్ర కాదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.ఇలాంటి గాలి వార్తలు ఎలా పుట్టుకొస్తాయని చిత్ర యూనిట్ మండిపడింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తోంది.అయితే ఈ సినిమాలో విజయ్ నటించే పాత్ర ఏమిటనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారిపోయింది.

మరి బన్నీ సినిమాలో పోలీస్ పాత్ర కాకుండా ఎలాంటి పాత్రలో అతడు కనిపిస్తాడా అని ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube