విలన్ పాత్రలో విజయ్ సేతుపతి.. న్యూ లుక్ చూసి ట్రోల్స్ చేస్తున్న నెటిజెన్స్?

తెలుగు సినీ ప్రేక్షకులకు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కోలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికీ విజయ్ సేతుపతి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

 Vijay Sethupathi New Look Viral In Social Media Vijay Sethupathi, New Look, Soci-TeluguStop.com

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయిన విషయం తెలిసిందే.పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయగలనటడు విజయ్ సేతుపతి.

సినిమాలో పాత్రకు ఏ విధంగా ఉండాలి అనుకుంటే ఆ విధంగా తనను తాను మార్చుకుంటూ ఉంటాడు.

విలన్ గా చేయాలి అంటే లావు పెరగడం హీరోగా నటించిన కోసం లావు తగ్గడం ఇలా ఆ పాత్రకు తగ్గట్టుగా మారిపోతూ ఉంటాడు.

ఇకపోతే విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి సంతానం అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఆ పాత్రలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు.ఆ సినిమాలో ముగ్గురు భార్యల ముద్దుల మొగుడిగా పొట్ట వేసుకొని బంగారు పన్ను పెట్టుకుని షాకిచ్చాడు విజయ్.ఇలా ఉంటే తాజాగా తన కొత్త సినిమా లుక్ కోసం మరోసారి లుక్ మార్చాడు విజయ్.

అయితే తాజాగా విజయ్ లుక్ ని చూస్తే ఒకేసారి గుర్తుపట్టడం కష్టం అనిపించవచ్చు.కాని కొంచెం శ్రద్ధగా చూస్తే విజయ్ సేతుపతి ని గుర్తు పట్టవచ్చు.

అయితే విక్రమ్ సినిమాలో లావుగా కడుపు పెంచుకొని బంగారపు పన్నుతో కనిపించిన విజయ్ తాజా సినిమా కోసం పూర్తిగా బరువు తగ్గి అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించడం మాత్రమే కాకుండా వైట్ షర్ట్ పెద్ద కళ్లద్దాలతో చిరునవ్వులు చిందిస్తూ విజయ్ సెల్ఫీ తీసుకున్నాడు.ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ ఫోటోని చూసిన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు విజయ్ లుక్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.అలాగే సినిమాల పట్ల విజయ్ కి ఉన్న డెడికేషన్ ని మెచ్చుకుంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube