హృతిక్ క్రిష్ 4లో విలన్ గా సౌత్ స్టార్ హీరో

ఇండియన్ సూపర్ హీరో మూవీ అంటే వెంటనే క్రిష్ సిరీస్ గుర్తుకొస్తుంది.హృతిక్ రోషన్ టైటిల్ రోల్ లో రాకేశ్ రోషన్ దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కుతూ వస్తుంది.

 Vijay Sethupathi Main Villain In Krrish 4, Indian Superman, Hrithik Roshan, Rake-TeluguStop.com

ఇప్పటి వరకు ఇండియన్ సూపర్ హీరో క్రిష్ సిరీస్ లో కోయీ మిల్ గయా నుంచి తీసుకుంటే మూడు సినిమాలు వచ్చాయి.మూడు భాగాలు కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.

ఈ నేపధ్యంలో ఈ సారి మరింత భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా యూనివర్శల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించేందుకు రంగం సిద్ధం అయ్యింది.ఇప్పటికే క్రిష్ 4 మూవీ గురించి రాకేశ్ రోషన్ అఫీషియల్ గా ప్రకటించారు.

వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతున్నారు.

దానికి తగ్గట్లే క్యాస్టింగ్ సెలక్షన్ కూడా జరుగుతుంది.

ఇక ఈ సినిమా కథ ఈ సారి విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉంటుందని తెలుస్తుంది, ఇందులో సైన్స్, సూపర్ పవర్ మధ్య వార్ గా కథని డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.

హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఈ సూపర్ మెన్ మూవీని ఈ సారి మరింత గ్రాండ్ గా తెరకెక్కించడానికి రాకేశ్ రోషన్ సిద్ధం అవుతున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హృతిక్ ఎదుర్కోబోయే విలన్ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ఆయనతో చర్చలు జరిగినట్లు సమాచారం.ఇక విజయ్ సేతుపతి కూడా ఇందులో నటించడానికి ఆసక్తిగానే ఉన్నారని తెలుస్తుంది.త్వరలో దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ఇక ఇందులో హీరోయిన్ గా కృతి సనన్ ఇప్పటికే ఫైనల్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube