చిన్న చిన్న పాత్రలకి కోట్లలో రెమ్యూనరేషన్ అంటే కష్టం బాసూ…  

Vijay Sethupathi Kollywood Hero - Telugu Huge Remuneration, Kollywood Hero, Pushpa, Tollywood, Uppena, Vijay Sethupathi

తమిళంలో ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన “పిజ్జా” చిత్రంలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి గురించి తెలియని వారుండరు.అయితే ఇతడు ఒకపక్క సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరో పక్క పలువురి స్టార్ హీరోల చిత్రాల్లో గెస్ట్ అప్పియరెన్స్ మరియు ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తున్నాడు.

 Vijay Sethupathi Kollywood Hero

అయితే ఇటీవల కాలంలో హీరో విజయ్ సేతుపతి సినిమాల్లో నటించేందుకు తీసుకునేటువంటి పారితోషకం గురించి  పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఇందులో ప్రస్తుతం విజయ్ సేతుపతి కి తమిళం, తెలుగు భాషల్లో మంచి క్రేజ్ ఉంది.

చిన్న చిన్న పాత్రలకి కోట్లలో రెమ్యూనరేషన్ అంటే కష్టం బాసూ…-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో విజయ్ సేతుపతి పలు గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో నటించేందుకు భారీ మొత్తంలో పారితోషకం డిమాండ్ చేస్తున్నాడట.గతంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన టువంటి సైరా నరసింహారెడ్డి అనే చిత్రంలో కూడా విజయ్ సేతుపతి ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించాడు.

ఇందుకుగాను చిత్ర యూనిట్ సభ్యులు విజయ్ సేతుపతి కి పెద్ద మొత్తంలోనే పారితోషికం ముట్ట చెప్పినట్లు సమాచారం.దీంతో కొందరు దర్శకనిర్మాతలు విజయ్ సేతుపతి ని తమ చిత్రాల్లోకి తీసుకోవాలా వద్దా  అనే సందిగ్దంలో పడ్డారు.

అయితే తాజాగా విజయ్ సేతుపతి టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న టువంటి పుష్ప అనే చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.కాగా ఈ పాత్రకి కూడా విజయ్ సేతుపతి దాదాపుగా పది కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడట.

దీంతో చిత్ర యూనిట్ సభ్యులు  సేతుపతిని తీసుకునే విషయంలో కొంత మేర ఆలోచనలో పడగా అల్లుఅర్జున్ రంగంలోకి దిగి చిత్ర యూనిట్ సభ్యులకి సర్దిచెప్పి విజయ్ సేతుపతి విషయంలో ఓ సరైన నిర్ణయం తీసుకున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విజయ్ సేతుపతి టాలీవుడ్ లో మెగా హీరో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నటువంటి  ఉప్పెన అనే చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు