Vijay Sethupathi : పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన విజయ్ సేతుపతి.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.విజయ్ సేతుపతి కోలీవుడ్ స్టార్ హీరో అయినప్పటికి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

 Vijay Sethupathi Interesting Comments On Politics And Political Entry-TeluguStop.com

వైష్ణవ్ తేజ్( Vaishnav Tej ) నటించిన ఉప్పెన సినిమా( Uppena movie )తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయిన విషయం తెలిసిందే.సినిమాలలో అవకాశాలు దొరికాయి అంటే టాలీవుడ్,బాలీవుడ్ కోలీవుడ్ అని సంబంధం లేకుండా ఎక్కడైనా నటించడానికి అయినా కూడా సిద్ధంగా ఉంటారు విజయ్ సేతుపతి.

ప్రస్తుతం తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్న సేతుపతి అడపాదడపా తెలుగు, హిందీల్లోనూ మెరుస్తున్నారు.అయితే ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తేనే ఇతర భాషల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు విజయ్.బాలీవుడ్ లో ఇటీవలె విడుదలైన ఫర్జీ అనే వెబ్​ సిరీస్​ లోనూ తనదైన యాక్టింగ్​తో అలరించారు విజయ్.కాగా విజయ్ సేతుపతిని అభిమానులు మక్కల్ సెల్వన్ అని పిలుస్తూ ఉంటారు.

ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్ రాజకీయాలపై ఆసక్తికర వాఖ్యలు చేశారు.డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 70వ బర్త్ డే సందర్భంగా చెన్నైలోని తేనాంపేటలో స్టాలిన్ 70 పేరుతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి పలువురు నటీనటులు హాజరయ్యారు.విజయ్ సేతుపతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇప్పటి యువత పాలిటిక్స్ గురించి తెలుసుకోవాలని, తనకు రాజకీయాల పై పూర్తి అవగాహన ఉందని, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన మాత్రం ఇప్పుడు లేదు అని తెలిపారు విజయ్ సేతుపతి.

అలాగే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దీంతో సేతుపతి పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అయ్యిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube