వివాదాస్పద వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి..?

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి.ఈయన తన నటనతో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు.ఈయనకున్న అభిమానులు కూడా అంతా ఇంతా కాదు.తమిళం, తెలుగు, మలయాళం, హిందీ సినిమాలలో నటించి స్టార్ హీరోగా నిలిచాడు.తన నటనకు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు.సినీ నటుడు గానే కాకుండా నిర్మాత, స్క్రీన్ రైటర్, ప్లే బ్యాక్ సింగర్ గా కూడా విజయ్ సేతుపతి బాధ్యతలు తీసుకున్నాడు.

 Vijay Sethupathi In The Controversial Web Series-TeluguStop.com

చిన్న సినిమాతో కేవలం చిన్న పాత్రలతో వెండితెరకు పరిచయమైనా విజయ్ సేతుపతి ప్రస్తుతం ఓ రేంజ్ లో నిలిచాడు.మొదటిసారి పిజ్జా సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి పలు భాషలలో కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక చిరంజీవి నటించిన సైరా సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఇక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రిగా నెగటివ్ రోల్ లో నటించగా ఈ సినిమాకు హైలెట్ గా విజయ్ సేతుపతి పాత్రనే మంచి క్రేజ్ తీసుకొచ్చింది.

 Vijay Sethupathi In The Controversial Web Series-వివాదాస్పద వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లో నటించిన విజయ్ సేతుపతి తాజాగా మరో వెబ్ సిరీస్ లో నటించనున్నాడట.అది కూడా వివాదాస్పద వెబ్ సిరీస్ లో నటించడానికి ముందుకు వచ్చాడని తెలుస్తుంది.ఇక ఈ సిరీస్ కోసం మేకర్స్ తనను సంప్రదించారని తెలుస్తోంది.ఇంతకీ ఆ సిరీస్ ఏదో కాదు.ఇటీవలే విడుదలైన ది ఫ్యామిలీ మాన్ 2.ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైనప్పుడు సమంత నటించిన పాత్రకు తమిళ ప్రజలు మండిపడిన సంగతి తెలిసిందే.

ఇక సిరీస్ విడుదలయ్యాక మంచి సక్సెస్ ను అందుకుంది.ఇక దీంతో ఈ సిరీస్ దర్శకుడు రాజ్ డీకే త్వరలో ది ఫ్యామిలీ మాన్ 3 ను మొదలు పెట్టనున్నట్లు తెలియగా అందులో విజయ్ సేతుపతి తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

#FamilyMan3 #VijaySethupathi #Controversial #Wed Series

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు