పవన్ కళ్యాణ్ కు విలన్ గా స్టార్ హీరో.. ఎవరంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, భీమ్లా నాయక్ లాంటి సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

 Vijay Sethupathi In Pawan Kalyan Movie Pawan Kalyan, Vijay Sethupathi, Harish Shankar, Tollywood,-TeluguStop.com

ఇక హీరో రానా, పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్.ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు, సాంగ్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఇక ఫిబ్రవరి 25న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

 Vijay Sethupathi In Pawan Kalyan Movie Pawan Kalyan, Vijay Sethupathi, Harish Shankar, Tollywood, -పవన్ కళ్యాణ్ కు విలన్ గా స్టార్ హీరో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమా విడుదల తేదీకి ఇంకా సమయం ఉండటంతో తన తరువాత సినిమా షూటింగ్ లను మొదలు పెట్టాడు పవన్ కళ్యాణ్.మిగిలిన సినిమాల షూటింగ్ లను కూడా తీసుకొని ఆ సినిమాలను కూడా సమ్మర్ కీ రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నారు.

ఇక ఈ సినిమా తరువాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నారు అని సమాచారం.ఇప్పటికే హరీష్ శంకర్ సినిమాను కూడా మొదలు పెట్టేసాడు.

భవధీయుడు భగత్  సింగ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీమేకర్స్ నిర్మిస్తోంది.ఇక మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

Telugu Harish Shankar, Pawan Kalyan, Tollywood-Movie

కాకపోతే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం హరీష్ శంకర్ చాలా పవర్ ఫుల్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఇందులో పవర్ స్టార్ కి ప్రతినాయకుడి పాత్రలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఆ సినిమాలో విలన్ పాత్రలో విజయ్ సేతుపతి అయితే కరెక్ట్ గా సరిపోతాడు అని ఫిక్స్ అయ్యారట శంకర్.విజయ్ సేతుపతి తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇక విజయ్ సేతుపతి కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube