బన్నీ సినిమా నుండి బయటకొచ్చి తారక్‌తో కలిశాడట!- Vijay Sethupathi Ntr Allu Arjun

Vijay Sethupathi In NTR Movie, Vijay Sethupathi, NTR, Allu Arjun, Pushpa, NTR30 - Telugu Allu Arjun, Ntr, Ntr30, Pushpa, Vijay Sethupathi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు బన్నీ.

 Vijay Sethupathi Ntr Allu Arjun-TeluguStop.com

ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ‘పుష్ప’ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా ఏర్పడింది.ఇక ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సుకుమార్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమాలో విలన్ పాత్రలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతిని తొలుత చిత్ర యూనిట్ ఓకే చేశారు.కానీ చిత్ర యూనిట్‌తో విబేధాలు రావడంతో ఆయన ఈ సినిమా నుండి వాకౌట్ చేశాడు.

 Vijay Sethupathi Ntr Allu Arjun-బన్నీ సినిమా నుండి బయటకొచ్చి తారక్‌తో కలిశాడట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు ఆయన స్థానంలో ఈ సినిమాలో మరో తమిళ నటుడు బాబీ సింహా నటిస్తున్నాడు.అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 30వ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించేందుకు విజయ్ సేతుపతిని చిత్ర యూనిట్ సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

ఇక మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న కొత్త హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఉప్పెన చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.మరి బన్నీ సినిమా నుండి ఎగ్జిట్ అయిన విజయ్ సేతుపతి, తారక్ సినిమాలో ఎంట్రీ ఇస్తాడా లేడా అనేది ఆసక్తికరంగా మారింది.

#NTR30 #Allu Arjun #Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు