ప్రమాదంలో విజయ్ సేతుపతి కెరీర్.. ఏమైందంటే..?

ఈ మధ్య కాలంలో తెలుగులో విజయ్ సేతుపతి పేరు మారుమ్రోగుతున్న సంగతి సంగతి తెలిసిందే.గత నెల 12వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఉప్పెన మూవీ విడుదల కాగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు ఆ మూవీలో నటించిన విజయ్ సేతుపతి పాత్రకు మంచి పేరు వచ్చింది.

 Vijay Sethupathi Flop Movies Dubbed In Telugu-TeluguStop.com

తెలుగులో చాలామంది స్టార్ హీరోలు విజయ్ సేతుపతిని తమ సినిమాల్లో విలన్ గా నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమాలో కూడా విజయ్ సేతుపతి పేరే వినిపిస్తుండగా జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

 Vijay Sethupathi Flop Movies Dubbed In Telugu-ప్రమాదంలో విజయ్ సేతుపతి కెరీర్.. ఏమైందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే కొంతమంది నిర్మాతలు చేస్తున్న పనుల వల్ల విజయ్ సేతుపతి క్రేజ్ తగ్గుతుందని తెలుస్తోంది.తెలుగులో విజయ్ సేతుపతికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో కొందరు నిర్మాతలు విజయ్ తమిళంలో నటించి ఎప్పుడో విడుదలైన సినిమాల హక్కులను కొనుగోలు చేస్తున్నారు.

Telugu Dubbed In Telugu, Flop Movies, Movie Rights, Producers, Super Deluxe, Tamil Movies, Vijay Sethupathi, Vijay Setupathi Career-Movie

ఇలా తెలుగులో విడుదల కాబోతున్న సినిమాలలో విజయ్ సేతుపతి హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి.గతంలో కూడా కొందరు తమిళ హీరోలు నటించిన సినిమాలు ఈ విధంగా విడుదలయ్యాయి.తమిళంలోనే ఫ్లాప్ అయిన సినిమాలు తెలుగులో విడుదలైతే ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రాబోయే రోజుల్లో విడుదల తెలుగులో విడుదల కాబోతున్న డబ్బింగ్ సినిమాలు విజయ్ సేతుపతి కెరీర్ పై ప్రభావం చూపుతాయేమో చూడాల్సి ఉంది.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో కూడా మొదట విజయ్ సేతుపతికే విలన్ రోల్ పోషించే ఛాన్స్ దక్కగా డేట్స్ విషయంలో సమస్య రావడంతో విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.

#Flop Movies #VijaySetupathi #Tamil Movies #Super Deluxe #Producers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు