మారిపోయిన విజయ్ సేతుపతి.. రూ.55 కోట్లు కావాలంట..?

ఈ మధ్య కాలంలో సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించడం ద్వారా విజయ్ సేతుపతి పేరు మారుమ్రోగుతోంది.విజయ్ సేతుపతి ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు మంచి పేరు రావడంతో పాటు విజయ్ నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు హిట్ అవుతున్నాయి.

 Vijay Sethupathi Getting Paid More Than Shahid Kapoor, Vijay Sethupathi ,vijay S-TeluguStop.com

తెలుగు, తమిళ భాషల్లో అభిమానులను సంపాదించుకున్న విజయ్ సేతుపతికి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా సినిమా, వెబ్ సిరీస్ ఆఫర్లు వస్తున్నాయి.

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి విజయ్ సేతుపతి భారీ మొత్తం డిమాండ్ చేయడంతో ఆ విషయం కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ సన్నీ పేరుతో ఒక వెబ్ సిరీస్ ను రూపొందిస్తోంది.హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది.

ఈ వెబ్ సిరీస్ కోసం షాహిద్ ఏకంగా 40 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

Telugu Crore Rupees, Amazon Prime, Bollywood Web, Paid, Shahid Kapoor, Vijayseth

ఇదే వెబ్ సిరీస్ లో కీలక పాత్ర కొరకు సన్నీ వెబ్ సిరీస్ మేకర్స్ సంప్రదించగా విజయ్ సేతుపతి డిమాండ్ చేసిన పారితోషికం ఆ వెబ్ సిరీస్ మేకర్లను అవాక్కయ్యేలా చేసిందని తెలుస్తోంది.అయితే ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.విజయ్ సేతుపతి ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం కంటే షాహిద్ తీసుకుంటున్న మొత్తం కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసినట్టు వార్తలు వస్తుండటం గమనార్హం.

ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ కాగా బాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా విజయ్ సేతుపతి కోసం క్యూ కడుతూ ఉండటం గమనార్హం.విజయ్ సేతుపతికి ఉన్న స్టార్ డమ్ వల్ల ఆయన ఏ సినిమాలో నటించినా ఇతర భాషల్లో కూడా ఆ సినిమా డబ్బింగ్ రైట్స్ ఎక్కువ మొత్తంలో అమ్ముడవుతూ ఉండటం గమనార్హం.

విజయ్ సేతుపతి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించిన మాస్టర్ సినిమా సంక్రాంతి పండుగకు విడుదలై హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube