నిర్మాతలని భయపెడుతున్న విజయ్ సేతుపతి..!

తమిళంలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో విజయ్ సేతుపతి ఒకరు.ముందు వీజే గా చేసి ఆ తర్వాత సినిమా ఛాన్సులు అందుకుని స్టార్ గా ఎదిగారు.

 Vijay Sethupathi Demand Huge Remuneration-TeluguStop.com

ప్రతి సినిమా.ప్రతి పాత్ర ఆయన ఓన్ చేసుకునే విధానం ఆడియెన్స్ ను మెప్పిస్తుంది.

ఇదివరకు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విజయ్ సేతుపతి మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాలో నటించాడు.ఇక ఉప్పెన సినిమాలో శేషారాయణం పాత్రలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి.

ఉప్పెనతో తెలుగులో ఓ రేంజ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ సేతుపతి ఆ తర్వాత తెలుగు సినిమాల్లో నటించేందుకు భారీగా డిమాండ్ చేస్తున్నాడని టాక్.తన పారితోషికంతో అందరికి షాక్ ఇస్తునాడట.

రోజుకి కోటి రూపాయలు ఇస్తేనే సినిమా చేస్తా అంటున్నాడట.అంతేకాదు ప్రమోషన్స్ కి రానని.

తెలుగు సినిమా తమిళంలో రిలీజ్ చేయకూడదని లాంటి కండీషన్స్ పెడుతున్నాడట.సినిమా ప్రమోషన్స్ కు రావాలంటే రోజుకి 75 లక్షలు ఇవ్వాలని అంటున్నాడట.

విజయ్ సేతుపతి రేంజ్ కు అడిగినంత ఇవ్వొచ్చని తమిళ మేకర్స్ చేస్తుంటే తెలుగు వాళ్లు మాత్రం అతను అడిగినంత ఇచ్చేందుకు ఆలోచిస్తున్నారని టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube