కరోనాకు కాదు ముందు దానికి వ్యాక్సిన్ కనిపెట్టాలంటోన్న హీరో

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు.తమిళంలో అన్ని రకాల పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన విజయ్ సేతుపతి, తెలుగు జనాలకు కూడా సుపరిచితమే.

 Vijay Sethupathi, Corona Virus, Lockdown, Vaccine, Kollywood News-TeluguStop.com

తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ సేతుపతి, మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రలో నటించి మెప్పించాడు.

ఇక ఈ విలక్షణ నటుడు ఇప్పుడు తెలుగులో మరో సినిమాలో నటించాడు.

 Vijay Sethupathi, Corona Virus, Lockdown, Vaccine, Kollywood News-కరోనాకు కాదు ముందు దానికి వ్యాక్సిన్ కనిపెట్టాలంటోన్న హీరో-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’లో విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు.కాగా ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతుండటం తనను కలిచివేసిందని విజయ్ సేతుపతి అంటున్నారు.

కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతుండటం తాను చూడలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను కనుగొంటున్నట్లే, ఎప్పటినుండో ఈ భూమిపై ఉన్న ఆకలి అనే వ్యాధికి కూడా వ్యాక్సిన్ కనిపెడితే పేదలకు చాలా మంచి జరుగుతుందని ఆయన అంటున్నారు.

ఎప్పుడూ పేదలకు అండగా నిలిచే విజయ్ సేతుపతి మరోసారి ఈ కామెంట్ చేయడంతో ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.అటు తన దృష్టికి వచ్చిన పేదవారికి తనవంతు సాయం చేస్తున్నాని, మిగతా నటీనటులు కూడా పేదలకు బాసటగా నిలవాలని ఆయన కోరారు.

ఇలా విజయ్ సేతుపతి పేదల కోసం ఆరాట పడుతుండటంతో ఆయన ఫ్యాన్స్‌తో పాటు పలువురు సినీ ప్రేమికులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube