కృతి శెట్టిని తన సినిమాలో వద్దంటున్న విజయ్..కారణం?

ఉప్పెన సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమయిన విషయం తెలిసిందే.ఈ అమ్మడు పరిచయమైన మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను బాలా ఆకట్టుకుంది.17 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా పరిచయ మయ్యి బిజీగా మారిపోయింది.ఈ ఒక్క సినిమా హిట్ తోనే చాలా అవకాశాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

 Actor Vijay Sethupathi Comments About Krithi Shetty, Krithi Shetty, Vijay Sethup-TeluguStop.com

ఈ మధ్యనే కృతి శెట్టికి విజయ్ సేతుపతి సినిమాలో ఆయనకు జోడీగా నటించే అవకాశం వచ్చిందట.ఈ సినిమాలో ఈమెను తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారని స్వయంగా విజయ్ సేతుపతి తెలిపారు.

అయితే అందుకు విజయ్ సేతుపతి అంగీకరించలేదట.ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి కృతి శెట్టికి తండ్రి పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

అందుకే ఆయన కృతి శెట్టి తో నటించడానికి నిరాకరించాడట.

ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ” నేను ఉప్పెన సినిమాలో కృతి శెట్టి తండ్రిగా నటించిన విషయం యూనిట్ సభ్యులకు తెలియదు.

అందుకే ఆమెను నాకు జంటగా తీసుకోవాలని అనుకున్నారు.కానీ నేను చేయను అని చెప్పా.

ఉప్పెన సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఆమెతో నన్ను తండ్రిగా భావించి నటించమని చెప్పను.నేను కూడా ఆమెను కూతురుగా భావించే నటించా.

నాకు 15 ఏళ్ల కొడుకు ఉన్నాడు.వాడి కంటే కృతి రెండు సంవత్సరాలు మాత్రమే పెద్దది.

అందుకే నేను తనని కూతురులాగానే భావిస్తున్నాను.

Telugu Role, Kollywood, Krithi Shetty, Tollywood, Uppena, Vijaysethupathi-Movie

కాబట్టి యూనిట్ సభ్యులకు వేరే హీరోయిన్ ను ఎంపిక చేయమని చెప్పను.కూతురు లాగా అనుకున్న అమ్మాయితో నేను రొమాన్స్ ఎలా చెయ్యగలను అని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు”.నిజంగా ఇలా ఆలోచించడం పెద్ద విషయమే.

ఈ విషయంలో విజయ్ సేతుపతిని మెచ్చుకోవాల్సిందే.

Telugu Role, Kollywood, Krithi Shetty, Tollywood, Uppena, Vijaysethupathi-Movie

ప్రెసెంట్ విజయ్ సేతుపతి అటు హీరోగా చేస్తూనే ఇటు నటుడిగా కూడా మంచి మంచి పాత్రలు చేస్తున్నారు.ఉప్పెన తర్వాత తెలుగులో కూడా మంచి అవకాశాలే వస్తున్నాయి.కానీ ఆయన బిజీ షెడ్యూల్ వల్ల కొన్ని సినిమా అవకాశాలను వదులుకోవాల్సి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube