బన్నీ సుకుమార్‌ల కోసం విలన్‌గా తమిళ స్టార్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

 Vijay Sethupathi Asvillain In Allu Arjun Sukumar Movie-TeluguStop.com

ఈ సినిమా తరువాత బన్నీ సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడు.ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

బన్నీ-సుకుమార్ సినిమాలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేథుపతి విలన్‌గా నటించనున్నాడట.ఇప్పటికే దీనికి సంబంధించి డిస్కషన్స్ కూడా జరిగాయట.రంగస్థలం సినిమా తరువాత సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.ఇక ఈ సినిమాతో తమిళనాట కూడా బన్నీ తన ఖాతా తెరవాలని చూస్తున్నాడు.

విజయ్ సేతుపతిని విలన్‌గా పెట్టుకుంటే ఈ సినిమాకు తమిళనాట కూడా మంచి క్రేజ్ ఏర్పడుతుందని చిత్ర భావిస్తోంది.

Telugu Allu Arjun, Sukumar, Telugu, Tollywood-

ఇటీవల విజయ్ సేతుపతి చిరంజీవి సైరా చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించాడు.అంతేగాక వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న ‘ఉప్పెన’లో కూడా విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించనున్నాడు.దీంతో మెగా ఫ్యాన్స్ విజయ్‌ సేతుపతి బన్నీ సినిమాలో విలన్‌గా నటిస్తే బాగుంటుందని కోరుతున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube