విజయ్ సేతుపతి, తాప్సీ ద్విపాత్రభినయం.. ఒకే సినిమాలో?

ఏ సినిమాలోనైనా ఒక హీరో లేదా హీరోయిన్ ద్వి పాత్రల్లో కనిపిస్తారు.అలా సినిమాకు రెండు పాత్రలు అనేవి స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపిస్తుంది.

 Vijay Sethupathi And Taapsee Both To Play Dual Role, Vijay Sethupathi, Taapsee,-TeluguStop.com

అలా ఎన్నో సినిమాలు మంచి సక్సెస్ ను అందుకోగా హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా రెండు పాత్రల్లో కనిపిస్తే మాత్రం ఆ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అలా కొందరు స్టార్ నటుల సినిమాలు కూడా కూడా తెరకెక్కాయి.

ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి, తాప్సీ లు కూడా ఓ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించనున్నారు.

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.

ఇక ఈయన తమిళంలో ఓ సినిమాలో నటించగా అందులో స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను కూడా నటించింది.అన్నా బెల్లి సుబ్రహ్మణ్యం అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కనుండగా.

త్వరలోనే ఓటీటీ వేదికగా విడుదల కానుంది.ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను కూడా మార్చడానికి సినీ బృందం పలు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది.

ఇందులో విజయ్ సేతుపతి, తాప్సీ.ఇద్దరు రెండు పాత్రలలో చేశారట.అంతేకాకుండా ఈ సినిమాకు వీరి పాత్రలే బాగా హైలెట్ గా ఉంటాయని తెలుస్తుంది.ఇక ఇప్పటి వరకు తాప్సీ కానీ లేదా విజయ్ సేతుపతి కానీ ద్వి పాత్రలో నటించక పోగా తొలిసారిగా ఈ సినిమాతో ద్వి పాత్రలలో కనిపించనున్నారు.

ఇక ఈ సినిమాను కేవలం తమిళంలోనే కాకుండా మరిన్ని భాషల్లో కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Telugu Dual Role, Taapsee-Movie

ఇక ప్రస్తుతం ఈ సినిమా కొన్ని పనులతో బిజీగా ఉండగా త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.ఇక అసలు విడుదల డేట్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు సినీ బృందం.ఇక విజయ్ సేతుపతి అభిమానులు కూడా విజయ్ సేతుపతిని డబల్ రోల్ లో చూడటానికి తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ సినిమా ఎటువంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube