జగన్ ఢిల్లీ టూర్ పై విజయసాయి కినుకు ? పక్కనపెట్టేశారా ?  

Vijay Sai Tension Ys Jagan Delhi Tour - Telugu Jagan Delhi Tour, Sajjala Rama Krishna, Vijay Sai Reddy, Ys Jagan

గత కొద్ది రోజులుగా వైసీపీలో నెంబర్ టు స్థానంలో ఉంటూ వచ్చిన విజయసాయి రెడ్డిని జగన్ పక్కన పెడుతున్నారనే వార్తలు పెద్దఎత్తున వస్తున్నాయి.దానికి తగ్గట్లుగానే విజయసాయి రెడ్డి కొద్దిరోజులుగా పార్టీలో యాక్టివ్ గా కనిపించడం లేదు.

 Vijay Sai Tension Ys Jagan Delhi Tour

పార్టీకి సంబంధించిన కీలకమైన అంశాలను చర్చిస్తున్న సమయంలోనూ ఆయన కనిపించడం లేదు.కొద్ది రోజుల క్రితం విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు జగన్ వెళ్లిన సందర్భంలో విజయసాయి కారు ఎక్కగా జగన్ దించేశారు.

ఇక అప్పటి నుంచి విజయసాయి రెడ్డి జగన్ స్నేహంపై అందరికి అనుమానాలు మొదలయ్యాయి.జగన్ ఉద్దేశపూర్వకంగానే ఆయనను పక్కన పెడుతున్నారనే విషయం చర్చనీయాంశమవుతోంది.

జగన్ ఢిల్లీ టూర్ పై విజయసాయి కినుకు పక్కనపెట్టేశారా -Political-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే విజయసాయి రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో వైసిపి రాజకీయ వ్యవహారాలన్నీ చూసుకునేవారు.కానీ జగన్ ఢిల్లీ పర్యటనపై విజయసాయిరెడ్డికి సమాచారం లేకుండానే జగన్ పర్యటన పెట్టుకోవడం, అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకోవడం, అలాగే కొంత మంది కేంద్ర మంత్రులను జగన్ కలిసే విషయంలోనూ విజయసాయిరెడ్డికి తెలియకుండానే జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

వాస్తవంగా అయితే జగన్ ఢిల్లీ టూర్ అంటే పక్కన విజయసాయిరెడ్డి ఉంటారు.రెండు మూడు రోజుల ముందే ఢిల్లీలో ఆయన మకాం వేసి మరి పరిస్థితులను చక్కదిద్ది తారు.

కానీ కానీ ఇప్పుడు మాత్రం ఆ హడావుడి కనిపించడం లేదు.అసలు విజయసాయిరెడ్డిని జగన్ తనతో పాటు తీసుకువెళ్లకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.సోమవారం విజయసాయిరెడ్డి విశాఖలోనే ఉన్నారు.విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ ఢిల్లీ వెళుతున్నారనే విషయాన్ని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు.

కానీ తాను వెళ్తున్నాను అనే విషయాన్ని కూడా చెప్పలేదు.అంటే జగన్ పర్యటన ఖరారైన, దానికి సంబంధించి విజయసాయి రెడ్డి కి ఏ సమాచారం జగన్ ఇవ్వలేదనే విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ గా మారింది.

గత కొంత కాలంగా విజయసాయి రెడ్డి ని దూరం పెడుతూ, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ని జగన్ హైలెట్ చేస్తున్నారనే విషయం అర్థమవుతోంది.కానీ ఇంత అత్యవసరంగా విజయసాయిరెడ్డిని జగన్ ఎందుకు దూరం చేసుకుంటున్నారు ? పాలనా విషయాల్లో విజయసాయిరెడ్డి పెత్తనం ఎక్కువైందని జగన్ కు ఫిర్యాదులు అందడంతోనే ఆయన ఈ విధంగా పక్కన పెడుతున్నారా అనే విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.కానీ ఇప్పటి వరకు జగన్ గాని, విజయసాయిరెడ్డి గాని ఇటువంటి వ్యాఖ్యలపై స్పందించలేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vijay Sai Tension Ys Jagan Delhi Tour Related Telugu News,Photos/Pics,Images..