చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అరెస్టుకు నిరసనగా నేడు సాయంత్రం టీడీపీ “మోత మోగిద్దాం” అనే నిరసన కార్యక్రమం చేపట్టడం తెలిసిందే.ఈ కార్యక్రమం పై వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి( Vijayasai Reddy ) సెటైర్లు వేశారు.
లంచాలు తీసుకొని కంచాలు మోగించటం ఏమిటని ప్రశ్నించారు.కంచాలు ఢిల్లీలో మోగిస్తే బాగుంటుందేమోనని నారా లోకేష్ పై( Nara Lokesh ) పరోక్షంగా సెటైర్లు వేశారు.
అదేవిధంగా ఆదాయపు పన్ను కార్యాలయం ముందు మోగించాలని సూచించారు.
నిజంగా టీడీపీ వాళ్ళు నీతిపరులైతే విచారణ ఎదుర్కొండని సవాల్ చేశారు.
స్టే లు తెచ్చుకోకుండా విచారణకు రావాలని.నీతి పరులైతే తన సవాల్ ను స్వీకరించాలన్నారు.
అప్పట్లో ఏం చేస్తారో చేసుకోండి అని చంద్రబాబు, లోకేష్ పదేపదే కామెంట్లు చేసినట్లు విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.సీఐడీ ( CID )చంద్రబాబుని ఆధారాలతో అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు.
చంద్రబాబు ఆస్తులు ఐదు లక్షల కోట్ల నుంచి ఆరు లక్షల కోట్ల వరకు ఉంటాయని విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ముందస్తు ఎన్నికలు ఉండవని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల జరుగుతాయని మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు.