పార్లమెంటరీ నేతగా విజయ సాయి రెడ్డి...లోక్ సభ కు మిథున్ రెడ్డి... దాదాపు ఖరారు

ఇటీవల ఏపీ లో ప్రభుత్వాన్ని ఏర్పరచిన వైసీపీ పార్టీ ఇప్పుడిప్పుడే నేతలను ఎన్నుకుంటుంది.పార్లమెంట్ లో తమ పార్టీ కి న్యాయకత్వం వహించే భాద్యతలు ఎవరికీ అప్పగించాలా అని ఆలోచించి మొత్తానికి ఆ భాద్యతలను అందుకోనున్న నేతలను ఏపీ సి ఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

 Vijay Sai Reddy Nominated As Parliamentary Leader-TeluguStop.com

ముందుగా ఊహించినట్లుగానే పార్టీ కీలక నేత విజయ సాయి రెడ్డి కి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా అవకాశం కల్పించారు.మొదటి నుంచి పార్టీ లో కీలక నేతగా వ్యవహారించిన విజయ సాయి రెడ్డి కి కీలక పదవి దక్కుతుంది అని ప్రతి ఒక్కరూ ఊహించారు.

అందరూ ఊహించినట్లు గానే పార్లమెంట్ లో పార్టీ న్యాయకత్వం వహించే భాద్యతలను విజయ సాయి రెడ్డికి అప్పగించడం తో ఆ విషయం తేటతెల్లమైంది.అలానే లోక్ సభా పక్ష నేతగా రాజంపేట ఎంపీ,జగన్ కు సన్నిహితుడైన మిథున్ రెడ్డి కి అవకాశం దక్కినట్లు తెలుస్తుంది.

-Telugu Political News

అలానే లోక్ సభ లో పార్టీ చీఫ్ విప్ గా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు జగన్ అవకాశం ఇచ్చారు.తొలుత ఈ పదవికి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కి అవకాశం దక్కుతుంది అని భావించారు కానీ మార్గాని వైపు జగన్ మొగ్గు చూపినట్లు తెలుస్తుంది.ఈ మేరకు సీ ఎం జగన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రికి లేఖ కూడా రాసినట్లు తెలుస్తుంది.మరోపక్క టీడీపీ పార్టీ కూడా ఇప్పటికే తమ పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్ ను ఎంపీక చేయగా, టీడీపీ రాజ్యసభాపక్ష నేతగా సుజనా చౌదరి, లోక్ సభాపక్ష నేతగా రామ్మోహన్ రావుకు అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube