'ఫెవికాల్ బాబా' అంటూ బాబు పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన విజయ సాయి రెడ్డి  

Vijaysai Reddy Comments On Ap Cm As Fevicol Baba-bjp,chandrababu,tdp,vijaysai Reddy,ysrcp,చంద్రబాబు,విజయసాయిరెడ్డి

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల కేంద్రంలో థర్డ్ ఫ్రాంట్ ఏర్పాటు చేయాలనీ,బీజేపీ కి ప్రత్యామ్న్యాయంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటూ చంద్రబాబు నాయుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారు అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. .

'ఫెవికాల్ బాబా' అంటూ బాబు పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన విజయ సాయి రెడ్డి -Vijaysai Reddy Comments On AP CM As Fevicol Baba

పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫొటోలు దిగుతూ, వాళ్లను కలుపుతా-వీళ్లను కలుపుతా అని చంద్రబాబు అంటున్నారని ఈ క్రమంలోనే చంద్రబాబుకు పలువురు నేతలు ఈ మారుపేరు పెట్టారనీ, జోకులు వేసుకుంటున్నారంటూ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈరోజు ట్విట్టర్ లో స్పందించిన ఆయన పై వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. ఎవరి టెన్షన్లలో వాళ్లుంటే సమయం, సందర్భం లేకుండా ఈ ఫెవికాల్ రాయబారాలు ఏమిటని అందరూ జోకులేసుకుంటున్నారంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మరోపక్క ఏపీ సి ఎం చంద్రబాబు రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తుంది.

మరి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు బాబు చెవిలో పడితే ఎలా స్పందిస్తారో చూడాలి.