100 కాదు కేవలం 8 కోట్లే ఖర్చు అయ్యిందట

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఆయన పర్యటన నిమిత్తం దాదాపు రూ.100 కోట్ల రూపాయల ఖర్చు చేసింది అంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది.అయితే ఈ ఆరోపణల పై గుజరాత్ రాష్ట్రం తాజాగా క్లారిటీ ఇచ్చింది.ట్రంప్ గుజరాత్ పర్యటనకు కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు రూ.100 కోట్లు ఖర్చు చేసింది అన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, కేవలం రూ.8 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాని వివరణ ఇచ్చారు.ఆయన పర్యటన నిమిత్తం కేవలం రూ.8 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు అసెంబ్లీ లో వెల్లడించారు.ట్రంప్ పర్యటన నిమిత్తం రూ.100 కోట్లు ఖర్చు చేశారని ప్రతిపక్ష పార్టీలు ఎలా ఆరోపణలు చేస్తున్నారో తెలియడం లేదని, అవి వింటే ఆశ్చర్యమేస్తుంది అంటూ వ్యాఖ్యానించారు.వారికి ఈ సంఖ్య ఎక్కడ నుండి వచ్చిందో తనకు తెలియదన్నారు.

 Vijay Rupani Refutes All Rumours Of Spending Rs 100 Crores On Namaste Trump-TeluguStop.com

రాష్ట్ర ప్రభుత్వం నుండి కేవలం రూ.8 కోట్లు మంజూరు చేయబడ్డాయని, అందులో రూ.4.5 కోట్లు రోడ్ల కోసం ఎఎంసి(అహ్మదాబాద్ పున్సిపల్ కార్పోరేషన్) ఖర్చు చేసిందని సిఎం విజయ్ రూపానీ తెలిపారు.ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబం తో కలిసి రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ లో పర్యటించిన సంగతి తెలిసిందే.అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన ట్రంప్ నేరుగా అక్కడ నుంచి సబర్మతి ఆశ్రమం కి కూడా వెళ్లి నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube