దొరసాని డైరెక్టర్ కి రౌడీహీరో బంపర్ ఆఫర్  

Vijay Offer To Dorasani Director-

రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా దొరసాని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి చెబుతూ ఏ రేంజ్ లో ఏమోషనల్ అయ్యాడో అందరికి తెలిసిందే.అయితే అదే స్టేజ్ పై దర్శకుడి పని తనాన్ని కూడా విజయ్ చాలా మెచ్చికున్నాడు.అతని మేకింగ్ కి ఫిదా అయిన విజయ్ ఓ బంపర్ ఆఫర్ కూడా ప్రకటించేశాడు...

Vijay Offer To Dorasani Director--Vijay Offer To Dorasani Director-

రెండు రోజుల క్రితమే దొరసాని ప్రివ్యూ చూశానని చెప్పిన విజయ్ డైరెక్టర్ కెవిఆర్.మెహేంద్ర మేకింగ్ చాలా బావుందని ప్రతి సీన్ లో తన మార్క్ క్రియేట్ చేశాడని చెప్పాడు.అదే విధంగా తన డైరెక్షన్ ఎంతగానో నచ్చింది అంటూ.*ఓ కథ నాకోసం రాస్తున్నవాని విన్నా తొందరగా స్క్రిప్ట్ ఫినిష్ చెయ్.చేయడానికి నేను రెడీ* అంటూ విజయ్ అతనికి అడక్కుండానే ఆఫర్ ఇచ్చేశాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో వర్క్ చేయడానికి చాలా మంది స్టార్ దర్శకులు క్యూలో ఉన్నారు.కథ నచ్చకుంటే విజయ్ వెంటనే రిజెక్ట్ చేస్తున్నాడు.అలాంటిది దొరసాని ఇంకా రిలీజ్ కూడా కాలేదు..

Vijay Offer To Dorasani Director--Vijay Offer To Dorasani Director-

అప్పుడే ఆ కొత్త దర్శకుడికి అందరి ముందు ఆఫర్ ఇచ్చాడు అంటే దొరసాని ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.ఏదేమైనా విజయ్ ఏమోషనల్ స్పీచ్ తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేశాడు.మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.