తెలుగు వారిని చులకనగా చూసిన తమిళ హీరో సినిమాను మనం చూడాలి?

ఒక సినిమా చేసినప్పుడు ఆ సినిమా ప్రమోట్‌ చేసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా హీరోపై ఉంటుంది.కాని తమిళ హీరోలు కొందరు మరీ అతి చేస్తున్నారు.

 Vijay Not Coming In Hyderabad For Bigil Movie Promotions-TeluguStop.com

ముఖ్యంగా తమిళ స్టార్‌ హీరో విజయ్‌ తెలుగులో తన సినిమాలను విడుదల చేస్తాడు.కాని తెలుగు వర్షన్‌ ప్రమోషన్‌కు మాత్రం అస్సలు రాడు.

గతంలో ఈయన నటించిన పలు సినిమాలు తెలుగులో విడుదల అయ్యాయి.కాని ఎక్కువ సార్లు ఆ సినిమాల ప్రమోషన్స్‌కు రాకుండా దూరంగా ఉన్నాడు.

Telugu Maheshkonneru, Tamila Vijay, Vijay, Vijayinsult, Vijayhyderabad-

  నిన్న విజయ్‌ నటించిన ‘బిగిల్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తెలుగులో బిగిల్‌ను విజిల్‌ అంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేశారు.సినిమాకు యావరేజ్‌ టాక్‌ వచ్చింది.సినిమా టాక్‌ సంగతి పక్కన పెడితే విజిల్‌ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో అసలు విజయ్‌ కనిపించలేదు.కేవలం ఒక్క రోజు దర్శకుడు అట్లీ కుమార్‌ వచ్చి ప్రచారం చేసి వెళ్లి పోయాడు.

Telugu Maheshkonneru, Tamila Vijay, Vijay, Vijayinsult, Vijayhyderabad-

  తెలుగులో సినిమాను విడుదల చేస్తున్న ఇతర తమిళ హీరోలు చాలా మంది తప్పకుండా హైదరాబాద్‌లో మీడియా సమావేశానికి హాజరు అవ్వడంతో పాటు కనీసం రెండు మూడు రోజులు ఉండి మరీ ప్రమోషన్స్‌లో పాల్గొంటారు.కాని విజయ్‌ మాత్రం అస్సలు తెలుగు వర్షన్‌ గురించి కనీసం మాట కూడా మాట్లాడలేదు.దాంతో కొందరు విజయ్‌పై ఆగ్రహంతో ఉన్నారు.తెలుగు వారు అంటే చులకన భావం కారణంగానే ఆయన రాలేదు అని అందుకే ఆయన సినిమాను మనం చూడాల్సిన అవసరం లేదు అంటూ కొందరు సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

దీంతో చాలా మందికి ఈ సినిమాపై ఆసక్తి తగ్గిందని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube