సీక్వెల్‌కు సై అంటోన్న విజయ్.. ఈసారి ఎలా ఉంటుందో?

మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ళ తరువాత సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన 150వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’ అందరికీ తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

 Vijay Next Movie To Be Sequel Of Thupakki-TeluguStop.com

ఈ సినిమాతో చిరు ఎలాంటి సక్సెస్‌ను అందుకున్నాడో అందరికీ తెలిసిందే.ఈ సినిమా చిరు కెరీర్‌లో బెస్ట్ కలెక్షన్స్‌ను రాబట్టింది.

అయితే ఈ సినిమా ఓ తమిళ సినిమాకు రీమేక్ అనే విషయం కూడా అందరికీ తెలిసిందే.

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘తుపాకీ’ సినిమా కోలీవుడ్‌లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమాతో విజయ్ కోలీవుడ్‌లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు.స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కొత్త సంచలనాలకు తెరలేపింది.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో పడ్డారట చిత్ర యూనిట్.తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఈ సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు అదిరిపోయే కథను రెడీ చేశారట.

అటు ఈ సినిమా కోసం తమిళ నిర్మాతలు కూడా భారీ బడ్జెట్‌ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారట.ఇప్పటికే మురుగదాస్-విజయ్ కాంబోలో ఓ సినిమా రానున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమను సన్ పిక్చర్స్ వారు ప్రొడ్యూస్ చేయనున్నారట.అయితే ఇది తుపాకీ సీక్వెల్ చిత్రామా కాదా అనే అంశం మాత్రం తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube