'మాస్టర్‌' విడుదల విషయంలో వెనక్కు వెళ్లే ఉద్దేశ్యం లేదట

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ హీరో గా నటించిన మాస్టర్‌ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.సౌత్‌ లో నాలుగు భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

 Vijay Movie Master Releasing For Sankranti Only Not Postponed  , Lokesh Kanagara-TeluguStop.com

భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా విడుదల సందర్బంగా తమిళనాడు ప్రభుత్వం థియేటర్లు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవచ్చు అంటూ ఆదేశాలు జారీ చేసింది.తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై కేంద్రం సీరియస్ అయ్యింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటూ హెచ్చరించడంతో వెంటనే తమిళనాడు ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది.ఈ నేపథ్యంలో మాస్టర్‌ సినిమా విడుదల విషయమై పుకార్లు షికార్లు చేశాయి.

మాస్టర్‌ సినిమా వంద కోట్ల బడ్జెట్‌ తో రూపొందింది.కనుక 50 శాతం ఆక్యుపెన్సీతో విడుదల చేస్తే ఖచ్చితంగా భారీ నష్టం తప్పదు.అందుకే ఆ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 50 శాతం ఆక్యుపెన్సీ అయినా విడుదల చేయాల్సిందే అంటూ నిర్ణయించుకున్నారట.

మీడియాలో వస్తున్నట్లుగా సినిమాను వాయిదా వేయడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.సినిమా ఇప్పటికే మొత్తం బిజినెస్ అయ్యింది.

కనుక కాస్త వెనకడుగు వేసినా కూడా మొత్తం డిస్ట్రిబ్యూటర్లు మరియు బయ్యర్లు గొడవ చేసే అవకాశం ఉంది.కనుక దేశ వ్యాప్తంగా అనుకున్నట్లుగానే సంక్రాంతికి సినిమాను విడుదల చేసి తీరుతామంటూ నిర్మాతలు ప్రకటించారు.

లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికే విడుదల చేయాలని భావించారు.కాని కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు.

ఆమద్య ఓటీటీలో విడుదల అన్నారు.కాని ఇప్పుడు థియేటర్లలో అది కూడా 50 శాతం ఆక్యుపెన్సీతో విడుదల చేయబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube