ఇళయదళపతి మాస్టర్ కూడా ఓటిటి బాటలోనే

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదలపతి విజయ్ ఈ మధ్య కాలంలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు.ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమా తర్వాత సినిమా చేస్తూ వరుస సక్సెస్ లతో కోలీవుడ్ రెండు వందల కోట్లకి పైగా బిజినెస్ చేస్తూ తన స్టామినా చూపిస్తున్నాడు.

 Vijay Master Movie Will Be In Ott, Lokesh Kanagaraj, Kollywood, South Cinema, Am-TeluguStop.com

అతని సినిమాలకి తెలుగులో కూడా ఈ మధ్య మంచి ఆదరణ లభిస్తుంది.తెలుగు, తమిళ బాషలలో మంచి ఈజ్ తో కమర్షియల్ సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.

ప్రస్తుతం విజయ్ ఖైదీ ఫేం లోకేష్ కనగరాజ్ తో మాస్టర్ సినిమా పూర్తి చేశాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.

ఇక సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చి సినిమా మీద అంచనాలు పెంచాయి.దీంతో విజయ్ ఖాతాలో మరో సూపర్ హిట్ గ్యారెంటీ అనే టాక్ బలంగా వినిపిస్తుంది.

ఖైదీ సినిమాతో తానెంటో ప్రూవ్ చేసుకున్న లోకేష్ ఈ సినిమాతో స్టార్ దర్శకుడుగా మారిపోతాడని అందరూ భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే సౌత్ లో ఈ మధ్య పెద్ద సినిమాలు అన్ని ఓటీటీలో రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి.

తెలుగు నుంచి పాన్ ఇండియా మూవీ నిశ్శబ్దం, నాని వి మూవీలు, తమిళం నుంచి ఆకాశం నీ హద్దురా సినిమాలు అమెజాన్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి.ఈ నేపధ్యంలో మాస్టర్ సినిమాకి కూడా అమెజాన్ నుంచి భారీగానే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.

అతని బిజినెస్ రేంజ్ కాకుండా సినిమాపై పెట్టిన పెట్టుబడికి రెట్టింపుని రైట్స్ రూపంలో ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది.అయితే విజయ్ సినిమాకి మొదటి పది రోజుల్లోనే వంద కోట్ల బిజినెస్ అయిపొయింది.

సినిమా హిట్ అయితే రెండు వందల నుంచి మూడు వందల కోట్లు కలెక్షన్ కచ్చితంగా వస్తాయి.మరి ఆ రేంజ్ మార్కెట్ ఉన్న విజయ్ కి అమెజాన్ ప్రైమ్ ఆఫర్ చేసింది తక్కువే అయిన ప్రస్తుతం పరిస్థితిలో థియేటర్లు ఓపెన్ కాని స్థితి కావడం వలన అది పెద్ద మొత్తమే అని తెలుస్తుంది.

అయితే సౌత్ లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాలకి ఒటీటీలో వస్తున్న రెస్పాన్స్ బట్టి మాస్టర్ సినిమా ఒటీటీలో రిలీజ్ చేయాలా లేక థియేటర్లుకి వెళ్ళాల అనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube