ఆన్ లైన్ లో లీకైన మాస్టర్ మూవీ  

పెద్ద సినిమాలకి పైరసీ కష్టాలు వెంటాడుతూ ఉంటాయి.చిన్న సినిమాల విషయంలో ఇది అంత ప్రమాదకరం కాకున్నా భారీ బడ్జెట్ తో తెరకెక్కించే పెద్ద సినిమాల మీద మాత్రం దీని ఎఫెక్ట్ ఉంటుంది.

TeluguStop.com - Vijay Master Movie Scenes Leakage

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న పైరసీ కేటుగాళ్లు సినిమాకి సంబందించిన కీలక విజువల్స్ ఆన్ లైన్ లో రిలీజ్ చేసి నిర్మాతలని దెబ్బతీస్తూ ఉంటారు.పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ కి ముందే సగానికి పైగా అవుట్ అవుట్ ఆన్ లైన్ లో రిలీజ్ అయిపొయింది.

దీంతో తప్పనిసరి పరిస్థితిలో అనుకున్న డేట్ కంటే ముందుగానే సినిమాని రిలీజ్ చేయాల్సి వచ్చింది.అయితే పవర్ స్టార్ క్రేజ్ కారణంగా ఆన్ లైన్ లో రిలీజ్ అయినా అవుట్ ఫుట్ సినిమా సక్సెస్ కి కారణం అయ్యింది.

TeluguStop.com - ఆన్ లైన్ లో లీకైన మాస్టర్ మూవీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అలాగే రజినీకాంత్ సినిమాలకి కూడా ఈ ఆన్ లైన్ లీకేజ్ బాధలు తప్పలేదు.సినిమాకి వర్క్ చేసిన పోస్ట్ ప్రొడక్షన్ టీం నుంచి ఈ పెద్ద సినిమాలకి సంబందించిన కీలక సన్నివేశాలు బయటకి వచ్చేస్తూ ఉంటాయి.

ఇప్పుడు విజయ్ మాస్టర్ సినిమాకి అలాంటి ఇబ్బందే ఎదురైంది.

ఈ సినిమాలో కీలక సన్నివేశాలని ఎవరో ఆన్ లైన్ లో లీక్ చేశారు.అవి కాస్తా వైరల్ అయ్యాయి.సినిమా రిలీజ్ కి ఒక్క రోజు ముందుగా ఇలా సినిమాలో సన్నివేశాలు లీక్ అవడంతో నిర్మాతలు టెన్షన్ పడ్డారు.

ఈ నేపధ్యంలో దర్శకుడు, నిర్మాతలు మీడియా ముందుకి వచ్చి సినిమాపై అభిమానులకి, ప్రజలకి తమ అభ్యర్ధన తెలియజేశారు.సినిమా రిలీజ్ కి ఇంకా ఒక్క రోజే ఉన్నందున అందరూ థియేటర్ లో మాస్టర్ సినిమాని చూసి ఆశ్వాదించాలని దయచేసి లీకైన సన్నివేశాలని వైరల్ చేయొద్దని కోరారు.

సినిమా మీద వందల మంది కష్టం ఉందని, మీరు లీకైన సన్నివేశాలు షేర్ చేయడం వలన వారి కష్టాన్ని దోచుకున్నట్లు అవుతుందని అన్నారు.మరి వారి అభ్యర్ధన చేస్తే లీకేజ్ మాఫియా గ్యాంగ్ లు నాశనం చేయకుండా వదులుతాయా అనేది చూడాలి.

#Leakage #Social Media #Kollywood #Piracy Mafia

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vijay Master Movie Scenes Leakage Related Telugu News,Photos/Pics,Images..