మాస్టర్ రివ్యూ: ఎలివేషన్స్‌తో పిచ్చెక్కించిన విజయ్

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ సంక్రాంతి కానుకగా నేడు థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా కోసం యావత్ విజయ్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Vijay Master Movie Review, Vijay, Master, Master Review, Vijay Sethupathi, Tolly-TeluguStop.com

కాగా ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.అయితే ఈ సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ కావడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్లి చూస్తున్నారు.ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ:

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, కాలేజీ ప్రొఫెసర్ జేడీ(విజయ్) స్టూడెంట్స్‌లో తనకంటూ మంచి ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంటాడు.అయితే ఆ కాలేజీలో స్టూడెంట్‌ ఎన్నికలు నిర్వహించే క్రమంలో జరిగే గొడవ కారణంగా హీరో విజయ్ తన పదవికి రిజైన్ చేసి ఓ జూవైనల్ హోమ్‌కు మాస్టర్‌గా వెళ్తాడు.ఈ క్రమంలో అక్కడ చిన్నపిల్లలతో నేరాలు చేయించే భవానీ గురించి తెలుసుకుని అతడి బారి నుండి హీరో ఆ పిల్లలను ఎలా కాపాడనేది స్తోరి.కాగా ఈ సినిమా కథ రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అయినప్పటికీ హీరో విజయ్‌తో పాటు విలన్ విజయ్ సేతుపతి ఎలివేషన్స్ పీక్స్‌లో ఉండటంతో ఈ సినిమా మాస్ ప్రేక్షకులను మెప్పించడం ఖాయం.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:

ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ తనదైన పద్దతిలో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడు.హీరోతో పాటు విలన్‌ను కూడా అదే స్థాయిలో ఎలివేట్ చేసి ఇద్దరి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశాడు ఈ డైరెక్టర్.అటు ఈ సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్ రవిచంద్రన్ తనదైన ఎనర్జిటిక్ మ్యూజిక్‌తో ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.

సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు బాగా కలిసొచ్చిన అంశంగా చెప్పొచ్చు.ఓవరాల్‌గా టెక్నికల్ పరంగా ఈ సినిమాకు అన్ని అంశాలు పర్ఫెక్ట్‌గా కుదిరాయి అని చెప్పాలి.
చివరగా: మాస్టర్ – ఎలివేషన్స్‌తో ఆకట్టుకున్నాడు!

రేటింగ్: 2.5/5.0

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube