మాస్టర్ మూవీ డిజిటల్ రిలీజ్ ఎప్పుడంటే..?- Vijay Master Movie Ott Release Date Fixed

vijay master movie ott release date fixed-master-lock down-50% occupancy-4 weeks-theaters-kollywood-bollywood-febraury 12-master movie-ott - Telugu Amazon Prime, February 12, Ott Release Date, Vijay Master Movie

కోలీవుడ్ హీరో విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కి ఈ నెల 13వ తేదీన తెలుగు, తమిళ హిందీ భాషల్లో విడుదలై యావరేజ్ ఫలితాన్ని అందుకుంది మాస్టర్.క్రిటిక్స్ నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు రాకపోయినా తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయి.

 Vijay Master Movie Ott Release Date Fixed-TeluguStop.com

కోలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ తెలుగులో సినిమాసినిమాకు మార్కెట్ ను పెంచుకుంటున్నారు.

ఇప్పటికే రజనీకాంత్, సూర్య, విశాల్ లకు తెలుగులో మార్కెట్ బాగానే ఉంది.ఈ హీరోల సినిమాలకు తెలుగులో భారీ కలెక్షన్లు వస్తున్నాయి.ఇలా తెలుగు మార్కెట్ ఉన్న హీరోలలో మాస్టర్ సినిమాతో విజయ్ కూడా చేరారు.50 శాతం ఆక్యుపెన్సీతో సైతం ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధించడం గమనార్హం.మరోవైపు వచ్చే నెలలో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందని తెలుస్తోంది.

 Vijay Master Movie Ott Release Date Fixed-మాస్టర్ మూవీ డిజిటల్ రిలీజ్ ఎప్పుడంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఫిబ్రవరి 12వ తేదీన ఈ మూవీ డిజిటల్ రిలీజ్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

సినిమా విడుదలైన నాలుగు వారాల తరువాత ఓటీటీలో అందుబాటులోకి వస్తూ ఉండటంతో థియేటర్ల ఓనర్ల నుంచి అభ్యంతరాలు ఉండవనే చెప్పాలి.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా ఈ సినిమా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.టాక్ తో సంబంధం లేకుండా 50 శాతం ఆక్యుపెన్సీతో కూడా మాస్టర్ మూవీ హిట్ కావడంతో ఇతర స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

మరోవైపు ఓటీటీల ద్వారా సినిమాలు అందుబాటులోకి వస్తూ ఉండటంతో ఒక వర్గం ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చాలా సంవత్సరాల నుంచి ప్రేక్షకులకు ఓటీటీలు అందుబాటులో ఉన్నా లాక్ డౌన్ సమయంలో కొత్త సినిమాలను డైరెక్ట్ గా రిలీజ్ చేయడం ద్వారా ఎక్కువమంది యూజర్లకు ఓటీటీలు చేరువవుతున్నాయి.

#Amazon Prime #February 12

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు