ఓటీటీలో కూడా మాస్టర్ సూపర్ హిట్టే.. కానీ..?

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సినిమాల్లో తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన మాస్టర్ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్న సంగతి తెలిసిందే.అయితే సినిమా థియేటర్లలో ఉన్న సమయంలోనే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసింది.

 Vijay Master Movie Block Buster Hit  In Amazon  Prime Ott,master Movie,lokesh Ka-TeluguStop.com

అయితే ఓటీటీలో కూడా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయని అక్కడ కూడా మాస్టర్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోందని తెలుస్తోంది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాకు తొలిరోజే 9.2 మిలియన్ వ్యూస్ వచ్చాయని వీకెండ్ కు 28 మిలియన్ వ్యూస్ వచ్చాయని తెలుస్తోంది.విజయ్ సినిమా థియేటర్లతో పాటు ఓటీటీల్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం గమనార్హం.అయితే ఓటీటీలో కూడా సినిమా హిట్టైనా హీరో విజయ్ మాత్రం మాస్టర్ మూవీ విషయంలో అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

Telugu Block Buster, Views, Vijay Master-Movie

సినిమా విడుదలైన 16 రోజులకే అమెజాన్ ప్రైమ్ లో విడుదల కావడం ఆయన అసంతృప్తికి కారణమని సమాచారం.50 శాతం ఆక్యుపెన్సీతో సైతం కొత్త రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా ఓటీటీలో విడుదల కాకపోయి ఉంటే కలెక్షన్లు మరింత పెరిగేవని విజయ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.థియేటర్ యజమానులు సైతం మాస్టర్ ఓటీటీ విడుదలను తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

విజయ్ ఫ్యాన్స్ సైతం తమ అభిమాన హీరో సినిమా ఓటీటీల్లో విడుదల కావడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించిన విజయ్ సేతుపతికి సైతం ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టింది.అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించగా ఈ సినిమా పాటలు పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube