మాల్యా భారత్ రాక మళ్లీ పడకన పడినట్లేనా !  

Vijay Malyabritish High Commission - Telugu British High Commission, Indian Officials, Legal Issue, London Court, Mumbai Centra Jail, Uk Law And Order, Vijay Malya

వేల కోట్ల రూపాయలు భారత బ్యాంకులకు టోకరా పెట్టి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.అతగాడిని ఎప్పుడెప్పుడు భారత్ కు తిరిగి తీసుకొద్దామా అని అధికారులు భావిస్తున్నారు.

 Vijay Malyabritish High Commission

ఈ క్రమంలోనే బ్రిటన్ కోర్టు లో కూడా భారత్ తన వాదనలు వినిపించి చివరికి ఎలాగో మాల్యా ను భారత్ కు తిరిగి తీసుకెళ్లవచ్చు అని అక్కడి కోర్టు ఒప్పుకొనేలా చేసింది.అయితే అదిగో ఇదిగో మాల్యా రాక ఖాయం అనుకుంటున్న సమయంలో ఇప్పుడు తాజాగా ఆయన రాక మరోసారి పడకన పడే అవకాశం కనిపిస్తుంది.

మాల్యాను భారత్ కు అప్పగిస్తారు అని,వెంటనే అధికారులు అతనితో కలిసి ఇండియా కు బయలుదేరి వస్తారంటూ భావిస్తుండగా ఇప్పుడు అతడ్ని భారత్ కు పంపలేమంటూ బ్రిటిష్ హై కమీషన్ పేర్కొన్నట్లు తెలుస్తుంది.భారత్ లోని ప్రభుత్వ,ప్రయివేట్ బ్యాంకులలో దాదాపు 9 వేల కోట్ల రూపాయల మేరకు టోకరా పెట్టి బ్రిటన్ పారిపోయి గత కొద్దీ కాలంగా అక్కడే తలదాచుకుంటున్నారు అయితే ఇటీవల బ్రిటన్ కోర్టు లో మాల్యా ను తిరిగి భారత్ కు అప్పగించాలి అంటూ భారత అధికారులు కోరగా దానికి అక్కడి కోర్టు అంగీకరిస్తూ తీర్పు వెల్లడించింది.

మాల్యా భారత్ రాక మళ్లీ పడకన పడినట్లేనా -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీనితో త్వరలో మాల్యా భారత్ కు తిరిగి వచ్చేస్తున్నాడు అని అందరూ భావించగా ఇప్పుడు తాజాగా బ్రిటిష్ హైకమిషన్ మాత్రం పంపలేమంటూ తెలిపింది.

చట్టంలో ఉన్న నిబంధనల దృష్ట్యా వాటిని పరిష్కరించాకే మాల్యా ను తిరిగి భారత్ కు పంపిస్తామని బ్రిటిష్ హై కమిషన్ పేర్కొంది.

అయితే, ఆ చట్ట సమస్య ఏంటన్నది చెప్పేందుకు నిరాకరించింది.అది రహస్యమని, యూకే లా ప్రకారం ఆ సమస్య పరిష్కరించాకే మాల్యాను దేశం దాటిస్తామంటూ స్పష్టం చేసింది.

అంటే.మాల్యా ఇప్పట్లో భారత్‌కు రావడం కష్టమేనా? అన్న సందేహం తలెత్తుతోంది.లండన్‌ కోర్టుల్లో ఎదురుదెబ్బ తగలగడంతో మాల్యాను భారత్‌కు తీసుకొచ్చి ముంబై ఆర్ధర్ రోడ్డులోని సెంట్రల్‌ జైలుకు తరలిస్తారని వార్తలు వచ్చాయి.కానీ, ఇప్పుడు యూకే చట్టం మాల్యాకు చుట్టంలా మారినట్లు అర్ధం అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vijay Malyabritish High Commission Related Telugu News,Photos/Pics,Images..

footer-test