సుప్రీం కోర్టు లో దొంగలు…మాల్యా కేసులో కొత్త ట్విస్ట్!  

Vijay Mallya case documents in supreme court go missing, Supreme Court, Vijay Mallya, Vijay Mallya case - Telugu Supreme Court, Vijay Mallya, Vijay Mallya Case, Vijay Mallya Case Documents In Supreme Court Go Missing

కొంతమందికి టైం అలా కలిసొస్తుందో ఏంటో మరి.దొంగలకు శిక్షలు విధించే సుప్రీం కోర్టులోనే దొంగలు పడ్డారు అంటే విచిత్రం అనే చెప్పాలి.

TeluguStop.com - Vijay Mallya Case Documents Missing Supreme Court

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

దేశంలో ప్రభుత్వ బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ను భారత్ కు తిరిగి రప్పించడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఈ సమయంలో ఈ కేసుకు సంబంధించి కీలక ట్విస్ట్ సంతరించుకుంది.ఈ డబ్బు ఎగవేతకు సంబంధించి రివ్యూ పిటీషన్ దాఖలు చేయగా ఇప్పుడు ఆ డాక్యుమెంట్లు అదృశ్యమైనట్లు సుప్రీం ధర్మాసనం గుర్తించింది.

TeluguStop.com - సుప్రీం కోర్టు లో దొంగలు…మాల్యా కేసులో కొత్త ట్విస్ట్-General-Telugu-Telugu Tollywood Photo Image

త‌మ పిల్ల‌ల‌కు 40 మిలియ‌న్ల డాల‌ర్లు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన విష‌యంలో జూలై 14, 2017 నాటి తీర్పుకు వ్యతిరేకంగా మాల్యా సమీక్ష పిటీషన్ దాఖలు చేశారు.అయితే తాజాగా ఈ సమీక్ష పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానంలో వీడియో కాన్షరెన్స్‌‌లో విచారణ జరపాలని ప్రయత్నించగా దానికి సంబందించిన పత్రాలు మాయం అవడం తీవ్ర కలకలం రేపింది.

దీంతో న్యాయమూర్తులు లలిత్, అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును ఆగస్టు 20 కి వాయిదా వేస్తూ తీర్పు వెల్లడించింది.మరోవైపు ఈ కేసు విచారణ సందర్భంగా కీలక పత్రాలు మాయం కావడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

***

మాల్యా రివ్యూ పిటిషన్‌ని సంబంధిత కోర్టులో గత మూడేళ్లుగా ఎందుకు లిస్ట్ చేయలేదో స్పష్టం చేయాల్సిందిగా రిజిస్ట్రీని న్యాయమూర్తులు ఆదేశించారు.

అసలు ఈ మూడు సంవత్సరాల్లో ఈ రివ్యూ పిటిషన్‌కి సంబంధించిన ఫైల్‌ను ఏయే అధికారులు డీల్ చేశారో అన్న వివరాలన్నింటినీ వెల్లడించాలి అంటూ సంబంధిత అధికారులను సూచించారు.

#Vijay Mallya #VijayMallya #Supreme Court

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vijay Mallya Case Documents Missing Supreme Court Related Telugu News,Photos/Pics,Images..