నా కోసం మోడీ ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకోండి అంటున్న విజయ్ మాల్యా!  

ఎస్బిఐ పై సంచలన విమర్శలు చేసిన విజయ్ మాల్యా. .

Vijay Mallya Accuses Sbi Of Wasting Taxpayers\' Money-congress,landon Court,modi,sbi Of Wasting Taxpayers\\' Money,vijay Mallya

దేశంలోనే అతి పెద్ద కుంభకోణంకి పాల్పడి రాత్రికి రాత్రి లండన్ పారిపోయి అక్కడి పౌరసత్వం తో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ని ఇండియాకి రప్పించే ప్రయత్నంలో ప్రభుత్వం, అలాగే స్టేట్ బ్యాంకు విశ్వప్రయత్నాలు చేసున్న సంగతి తెలిసిందే. తాజాగా లండన్ కోర్ట్ కూడా మాల్యా బిల్ పిటిషన్ కి కొట్టేసి అతనిని ఇండియాకి అప్పగించే నిర్ణయం విషయంలో నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే లండన్ లో ఉంటూ ఇండియా మీద, ప్రధాని మోడీ మీద ట్విట్టర్ వేదికగా గత కొంత కాలంగా విజయ్ మాల్యా విమర్శలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే..

నా కోసం మోడీ ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకోండి అంటున్న విజయ్ మాల్యా!-Vijay Mallya Accuses SBI Of Wasting Taxpayers' Money

తాజాగా మరో సారి తన నోటికి పని చెప్పాడు.

తనను భారత్‌కు రప్పించడానికి ఎస్‌బీఐ లాయర్ల కోసం ఎంత ఖర్చు పెడుతోందో తెలుసా అని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు. లండన్‌లోని బ్యాంకులో ఉన్న సుమారు 260, 000 పౌండ్లను మాల్యా వినియోగించుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం యూకే హైకోర్టు దానిని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో మాల్యా తన కోపాన్ని ఎస్బీఐ మీద చూపించాడు.

భారత్‌లో పన్నులు చెల్లిస్తున్న వారి సొమ్ముతో ఎస్‌బీఐ న్యాయవాదులు ఇక్కడ నాకు వ్యతిరేకంగా ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. భారతీయుల సొమ్ముతో ఎస్‌బీఐ లాయర్లు యూకేలో తమకు తాము ప్రచారం చేసుకుంటున్నారు అంటూ విరుచుకుపడ్డాడు.