తల్లిదండ్రులపై కేసు పెట్టిన స్టార్ హీరో విజయ్.. కారణమేమిటంటే?

కోలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ ఈ మధ్య కాలంలో వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.రోల్స్ రాయిస్ కారుకు ట్యాక్స్ చెల్లించే విషయంలో విజయ్ కోర్టును ఆశ్రయించగా కోర్టు పన్ను కచ్చితంగా చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.

 Actor Vijay Has Filed A Case In The Chennai Civil Court Against 11 Persons, Tami-TeluguStop.com

కోర్టు ఆదేశాల ప్రకారం విజయ్ ఇప్పటికే పన్ను చెల్లించారు.అయితే తాజాగా విజయ్ చెన్నై సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తల్లీదండ్రులతో పాటు మరో 11 మంది తన పేరును కానీ తన అభిమాన సంఘం పేరును కానీ ఉపయోగించుకోకూడదని పిటిషన్ లో విజయ్ పేర్కొన్నారు.కోలీవుడ్ లో భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న విజయ్ రాజకీయ ఆరంగేట్రం గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

అయితే వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రిస్క్ చేయాలని భావించడం లేదు.

Telugu Vijayfiled, Chennai Civil, Tamil Vijay, Viajy Complaint, Vijay-Movie

విజయ్ ఫాదర్ చంద్రశేఖర్ తన పేరును రాజకీయ స్వార్థం కోసం వినియోగిస్తున్నారని విజయ్ భావిస్తున్నారు.వచ్చే నెలలో తమిళనాడు రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.ఇలాంటి సమయంలో విజయ్ తన పేరును తల్లిదండ్రులు, మరికొందరు వినియోగించకూడదంటూ దాఖలు చేసిన పిటిషన్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

తమిళనాడులో కొత్తగా ఏర్పడిన జిల్లాలలో ఈ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నెల చివరిలో పిటిషన్ విచారణకు రానుంది.విజయ్ తండ్రి పార్టీ పేరు ఆల్ ఇండియా కమాండర్ విజయ్ పీపుల్స్ మూవ్ మెంట్ కాగా ఆ పార్టీతో తనకు ఏ సంబంధం లేదని విజయ్ తెలిపారు.అభిమానులు సైతం ఆ పార్టీకి అండగా నిలవవద్దని విజయ్ కోరారు.

విజయ్ హెచ్చరికల నేపథ్యంలో తండ్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube