తెలుగు రాష్ట్రాల్లో లెక్కలు తేల్చుకొని లైగర్.. అంత డిమాండ్ చేయడంతో?

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన భారీ యాక్షన్ డ్రామా లైగర్.డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

 Vijay Deverakonda's Liger Telugu States Theatrical Rights Deal Still Not Closed,-TeluguStop.com

ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఈ సినిమాలో భాగం కావడంతో ఈ సినిమా అక్కడ కూడా సాలిడ్ హైప్ క్రియేట్ అయ్యింది.

ఇంకా ఇంకా ప్రొమోషన్స్ చేస్తూ ఈ సినిమా హిందీ సినిమానే అనే రేంజ్ కు ఈ సినిమాను పూరీ టీమ్ తీసుకు వెళ్ళింది.అక్కడి ప్రేక్షకులు సైతం అక్కడ సినిమాలు వదిలేసి ఇక్కడ సినిమా అయినా లైగర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.

వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.రోజురోజుకూ అంచనాలు పెరగడంతో ఈ సినిమా బిజినెస్ అంతటా అంచనాలను మించి జరుగుతుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ పూర్తి చేసుకోలేదు అని తెలుస్తుంది.

Telugu Ananya Panday, Liger, Pre, Puri Jagannadh, Telugu-Movie

మరో 12 రోజుల్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఇంకా బిజినెస్ పూర్తి చేసుకోక పోవడం అందరికి షాక్ కు గురి చేస్తుంది.అయితే అందుకు కారణం ఏంటా అని ఆరా తీయగా.మేకర్స్ ఈ సినిమా రైట్స్ కోసం భారీగా డిమాండ్ చేయడమే ఇందుకు కారణం అని తెలుస్తుంది.

అంత భారీ మొత్తం ఇచ్చి మరీ రిస్క్ చేయలేక డిస్టిబ్యూటర్స్ కూడా వెయిట్ చేస్తున్నారని.కొంత మేర తగ్గించుకుని ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.మరి చివరకు ఈ సినిమా బిజినెస్ ఎంతమేర జరుగుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube