ఈ గ్యాప్ లో మూడు సినిమాలను లైన్లో పెట్టిన రౌడీ !

మన టాలీవుడ్ లో ఫ్యాన్స్ తమ హీరోలను ముద్దు పేరుతో పిలుచుకోవడం సాధారణంగానే జరుగుతుంది.అలాగే విజయ్ దేవరకొండను కూడా రౌడీ అని ఫ్యాన్స్ అభిమానంగా పిలుచుకుంటారు.

 Vijay Deverakonda Upcoming Movies-TeluguStop.com

అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ స్టార్ గా ఎదిగాడు విజయ్.ఈ సినిమా తర్వాత ఒక్కసారిగా యూత్ లో తన ఫాలోయింగ్ పెరిగింది.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తోలైగర్ సినిమా చేస్తున్నాడు.

 Vijay Deverakonda Upcoming Movies-ఈ గ్యాప్ లో మూడు సినిమాలను లైన్లో పెట్టిన రౌడీ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.

ఫస్ట్ లుక్ కు విశేష స్పందన వచ్చింది.ఈ సినిమాను పూరీ జగన్నాథ్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాతో విజయ్ మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటించ బోతున్నాడు.లైగర్ సినిమా కరోనా కారణంగా ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తుంది.పరిస్థితులు అనుకూలిస్తే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయాలనీ పూరీ అనుకుంటున్నాడు.అయితే విజయ్ దేవరకొండ ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే వరుస సినిమాలను లైనులో పెడుతున్నాడు.

Telugu Gowtam Tinnanuri, Puri Jagannadh, Shiva Nirvana, Upcoming Movies, Vijay Deverakonda, Vijay Deverakonda Upcoming Movies-Movie

ఈ గ్యాప్ లోనే మూడు సినిమాలను లైన్లో పెట్టాడు విజయ్.శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్టు ఎప్పుడో అధికారికంగా ప్రకటన వచ్చింది.అయితే కరోనా కారణంగా షూటింగ్లు సక్రమంగా జరగకపోవడంతో అన్ని సినిమాలు లేట్ అవుతూ వస్తున్నాయి.ప్రస్తుతం శివ నానితో టక్ జగదీశ్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత విజయ్ తో సినిమా స్టార్ట్ అవుతుంది.

విజయ్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్టు కూడా అధికారికంగా చెప్పారు.పుష్ప సినిమా పార్ట్ 1 తర్వాత సుకుమార్ విజయ్ సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలతో పాటు మరొక సినిమాకు కూడా ఓకే చెప్పినట్టు టాక్.

జెర్సీ సినిమా తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి విజయ్ కు ఒక కథను వినిపించి ఓకే చెప్పించుకున్నాడని తెలుస్తుంది.మొత్తానికి రౌడీ వరుస సినిమాలు లైన్లో పెడుతూ ఫుల్ జోష్ లో ఉన్నాడు.

#Upcoming Movies #Shiva Nirvana #Puri Jagannadh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు