దేవరకొండ చేసిన పనితో ఇతర హీరోలంతా మళ్లీ నోరు వెళ్లబెట్టారు  

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు చెబితే యూత్‌లో పూనకాలే. ముఖ్యంగా అమ్మాయిలు విజయ్‌ దేవరకొండ నామ జపం చేస్తున్నారు. ఎంతో మంది యంగ్‌ హీరోలు ఎన్నో సంవత్సరాలుగా సింగిల్‌ సక్సెస్‌ కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఏమాత్రం బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి విజయ్‌ దేవరకొండ కుమ్మేస్తున్నాడు. అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో ఈయన క్రేజ్‌ ఎక్కడికో వెళ్లింది. అద్బుతమైన సినిమాలు కాకున్నా కూడా విజయ్‌ దేవరకొండ మూవీ అంటే అభిమానులు ఓ రేంజ్‌లో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక తన సినిమాలను చాలా విభిన్నంగా ప్రమోషన్‌ చేస్తూ, అందరి దృష్టిని ఆకర్షించే విజయ్‌ దేవరకొండ తాజాగా మరోసారి ఈయన చేసిన పనుల కారణంగా యంగ్‌ హీరోలు అంతా కూడా నోరెళ్ల బెడుతున్నారు.

Vijay Deverakonda Surprises Tolly Celebs Kids-Gala Time Tolly Kids

Vijay Deverakonda Surprises Tolly Celebs Kids

టాలీవుడ్‌లో బిగ్‌ స్టార్స్‌ పిల్లలతో విజయ్‌ దేవరకొండ గెట్‌ టు గెదర్‌ ఏర్పాటు చేయడం ప్రస్తుతం టాలీవుడ్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. రాజమౌళి కూతురు, రవితేజ పిల్లలు, ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డ పిల్లలు, కీరవాణి కూతురు, బీవిఎస్‌ రవి పిల్లలు ఇలా స్టార్‌ కిడ్స్‌ తో విజయ్‌ దేవరకొండ చిన్న పార్టీని ఏర్పాటు చేశాడు. ఆ పార్టీలో అంతా కూడా రౌడీ వేర్‌ ధరించడం మరింత ఆకర్షణగా నిలిచింది. విజయ్‌ దేవరకొండ మొదలు పెట్టిన రౌడీ బ్రాండ్‌ను వారు ధరించడంతో విజయ్‌ దేవరకొండ అంటే వారికి ఎంత అభిమానమో చెప్పనక్కర్లేదు.

Vijay Deverakonda Surprises Tolly Celebs Kids-Gala Time Tolly Kids

విజయ్‌ దేవరకొండతో ఫొటో దిగుతున్న సమయంలో ప్రతి ఒక్కరి మొహం వెలిగి పోతుంది. ఒక సామన్య ప్రేక్షకుడు స్టార్‌తో ఫొటో దిగిన సమయంలో సంతోషంతో మొహం మారిపోతుంది. ఇప్పుడు ఈ స్టార్‌ కిడ్స్‌ మొహం కూడా వెలిగి పోతుంది. వారి మొహాల్లో విజయ్‌ దేవరకొండను వారు ఎంతగా అభిమానిస్తున్నారో కనిపిస్తుంది. ఎంతో మంది స్టార్‌ హీరోు ఉన్నా కూడా ఈ స్టార్‌ కిడ్స్‌ అంతా కూడా దేవరకొండను అభిమానించడంకు ఆయన బాడీ లాంగ్వేజ్‌ మరియు మాట తీరు అని చెప్పుకోవచ్చు. దేవరకొండ క్రేజ్‌ చూసి ఇతర యువ హీరోలు మరోసారి నోరు వెళ్లబెడుతూ ఉంటారు.