లైగర్ రీమేక్ సినిమానా.. దీనిపై విజయ్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ లో రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు రోజు రోజుకూ అభిమానుల సంఖ్య పెరిగి పోతుంది.విజయ్ కు టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Vijay Deverakonda Reveals If Liger Is Not Remake Details, Vijay Deverakonda, Ananya Panday, Liger, Liger Remake, Amma Nanna O Tamila Ammayi, Liger Movie Remake, Director Puri Jagannath-TeluguStop.com

ప్రెసెంట్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ సినిమా మరొక నెల రోజుల్లో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నాడు.

ఆగష్టు 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

 Vijay Deverakonda Reveals If Liger Is Not Remake Details, Vijay Deverakonda, Ananya Panday, Liger, Liger Remake, Amma Nanna O Tamila Ammayi, Liger Movie Remake, Director Puri Jagannath-లైగర్ రీమేక్ సినిమానా.. దీనిపై విజయ్ షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదటి సారి విజయ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు.ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో విజయ్ మరింత స్టార్ డమ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు.

ఇక రిలీజ్ కూడా దగ్గర పడడంతో మేకర్స్ ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలతో పాటు.

ఫ్యాన్ డమ్ టూర్ కూడా స్టార్ట్ చేసి దేశం మొత్తం చుట్టేస్తున్నారు.

ఇక తాజాగా విజయ్ మీడియాతో ముచ్చటించి ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు.

Telugu Ammananna, Ananya Panday, Puri Jagannath, Liger-Movie

అలాగే లైగర్ సినిమా రీమేక్ అంటూ వస్తున్న వార్తలపై విజయ్ ఆన్సర్ ఇచ్చాడు.ఈ సినిమా రీమేక్ కాదని.అసలు రీమేక్ సినిమాలు చేయడం అంటే తనకు ఇష్టం లేదని.ఎప్పటికి తాను రీమేక్ సినిమాలు చేయనని విజయ్ తెలిపాడు.ఇక లైగర్ సినిమా పక్కా తెలుగు సినిమా అని తల్లి కొడుకుల మధ్య ఉండే అనుబంధం ఈ సినిమాకే హైలెట్ కాబోతుందని స్పష్టం చేసాడు.

Telugu Ammananna, Ananya Panday, Puri Jagannath, Liger-Movie

అమ్మానాన్న ఒక తమిళమ్మాయి సినిమా అంటే చాలా ఇష్టం అని.అయితే లైగర్ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుందని తప్పకుండ మేము అంచనాలను అందుకుంటాం అని తెలిపాడు.ఇక ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.

హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube